సిరిసిల్ల: ధాన్యం సేకరణ ప్రక్రియలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, కొనుగోళ్లు వేగంగా జరిగేలా పర్యవేక్షించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. ఆన్‌లైన్ ట్యాబ్ ఎంట్రీలో జాప్యం లేకుండా చూడాలన్నారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్‌తో కలిసి జిల్లాలోని అధికారులతో శనివారంటెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తూకం వేసిన ధాన్యం బస్తాలను తరలించేందుకు సరిపడా వాహనాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
22న జిల్లా స్థాయి సభ
జిల్లాలో ఈనెల 22న నిర్వహించే యువజన, క్రీడా వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో యువతను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలని, ప్రణాళిక ప్రకారం మే 18న అంబేడ్కర్ విగ్రహం నుంచి బతుకమ్మ ఘాట్ వరకు ఉదయం 6:30 గంటలకు 2కే రన్, 19న కలెక్టరేట్‌లో ‘కెరీర్ – నైపుణ్యాభివృద్ధి’ ఉపాధి అవకాశాలపై అవగాహన సదస్స నిర్వహించాలన్నారు. 21న సిరిసిల్లలోని మినీ స్టేడియంలో క్రీడా దినోత్సవంలో భాగంగా కబడ్డీ, వాలీబాల్, కరాటే, షటిల్ బ్యాడ్మింటన్ వంటి పోటీలు నిర్వహించాలని సూచించారు. 22న స్వచ్ఛ తెలంగాణ, సాయంత్రం సిరిసిల్ల కొత్త చెరువు వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
23న జాబ్ మేళా
ఈనెల 23న బైపాస్ రోడ్డులోని కె–కన్వెన్షన్ హాల్‌లో ఉదయం 9 గంటల నుంచి జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీపీవో శ్రీనివాసాచారి, డీవైఎస్‌వో అజ్మీరా రాందాస్ పాల్గొన్నారు.
‘ఎస్‌ఐఆర్‌ను పారదర్శకంగా నిర్వహించాలి’
ఎస్‌ఐఆర్‌ను పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎన్నికల నమోదు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు రాజేందర్‌రెడ్డి, కేఎస్‌బీ కుమారి, తహసీల్దార్లు మహేశ్, జయంత్, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్, రెహమాన్ పాల్గొన్నారు.


