సిరిసిల్ల: చందుర్తి సీఐగా పనిచేస్తూ ఇటీవల డీఎస్పీగా పదోన్నతి పొందిన గాండ్ల వెంకటేశ్వర్లును జిల్లాకు కేటాయిస్తూ డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు వెంకటేశ్వర్లు డీఎస్పీ హోదాలో ఎస్పీ మహేశ్ బీ గీతేను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి విధుల్లో చేరారు. వెంకటేశ్వర్లు 2001లో కోనరావుపేట ఎస్సైగా జిల్లాలో విధుల్లో చేరారు. అప్పట్లో నక్సలైట్ల ప్రాబల్యం గల కోనరావుపేట మండలంలో సమర్థ అధికారిగా పనిచేశారు. ఎల్లారెడ్డిపేటలోనూ ఎస్సైగా పనిచేశారు. సీఐగా ఏసీబీలో పనిచేసిన వెంకటేశ్వర్లు సీఐగా చందుర్తిలో పనిచేశారు. డీఎస్పీగా పదోన్నతి పొంది జిల్లాకు రావడం విశేషం.


