ఐఐహెచ్‌టీ కోర్సులతో ఉపాధి | - | Sakshi
Sakshi News home page

ఐఐహెచ్‌టీ కోర్సులతో ఉపాధి

May 13 2026 1:56 AM | Updated on May 13 2026 1:56 AM

సిరిసిల్ల: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హాండ్ల్యూమ్‌ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ) పూర్తి చేసిన వారికి దేశవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు ఉన్నాయని సిరిసిల్ల చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకులు సంతోష్‌కుమార్‌ అన్నారు. మంగళవారం పట్టణంలోని బీవైనగర్‌లో గల చేనేత, జౌళిశాఖ ఆఫీస్‌లో నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. పదో తరగతి పాస్‌ అయిన విద్యార్థులు ఈ కోర్సులో చేరితే నమ్మకమైన ఉపాధి అవకాశం ఉంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపకార వేతనం అందిస్తూ శిక్షణ ఇస్తాయన్నారు. జిల్లా నుంచి ప్రస్తుతం 13 మంది మాత్రమే దరఖాస్తులు చేశారని, మరింత మంది ముందుకు రావాలని కోరారు. హైదరాబాద్‌లోని నాంపల్లి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఐఐహెచ్‌టీలో చేరాల్సి ఉంటుందన్నారు. ఎంఎస్‌ఎంఈ అధికారి యుగేంధర్‌ మాట్లాడుతూ, సిరిసిల్లలోని వస్త్రోత్పత్తిదారులు బ్యాంకు రుణాలు పొందుతూ పరిశ్రమను మరింత అభివృద్ధి పథంలో నడిపించే అవకాశం ఉందన్నారు. సైకాలజిస్ట్‌ పున్నంచందర్‌, వస్త్రోత్పత్తిదారులు వేముల దామోదర్‌, శ్రీధర్‌, మధు, వెల్ది హరిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement