నా వెంటే నా పిల్లలు.. | - | Sakshi
Sakshi News home page

నా వెంటే నా పిల్లలు..

May 10 2026 9:46 AM | Updated on May 10 2026 9:46 AM

నా వెంటే నా పిల్లలు..

ఇల్లంతకుంట: నేను, మా ఆయన వెంకటేశ్వరరెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయులం. మాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయి చైత్ర 8వ తరగతి, చిన్నమ్మాయిని ఫ్రీ ప్రైమరీ స్కూల్‌లో చేర్పించా. పిల్లలిద్దరినీ నేను పని చేసే పాఠశాలలోనే చదివిస్తున్నా. విధులు నిర్వహిస్తూ కుటుంబ బాధ్యతలు, పిల్లలను చూసుకోవడం కష్టంగానే ఉన్నా ఇష్టంగానే చేస్తుంటా. ఉదయం 4 గంటలకు లేచి ఇంటి పని చేసుకుని పిల్లలను స్కూల్‌కు వెళ్తాం. ఇంటి పనుల్లో భర్త చేదోడు వాదోడుగా ఉంటారు. విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలతో గడుపుతూ వారికి మంచి విలువలు, సంప్రదాయాలు నేర్పిస్తా. – సుప్రియ, ప్రభుత్వ టీచర్‌, ముస్కానిపేట

Advertisement
 
Advertisement
Advertisement