మిల్లుల్లో వేగంగా ధాన్యం దింపుకోవాలి | - | Sakshi
Sakshi News home page

మిల్లుల్లో వేగంగా ధాన్యం దింపుకోవాలి

May 5 2026 7:02 AM | Updated on May 5 2026 7:02 AM

● హమాలీలు, లారీల సంఖ్యను పెంచాలి ● కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

● హమాలీలు, లారీల సంఖ్యను పెంచాలి ● కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

సిరిసిల్ల: కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే లారీల నుంచి ధాన్యాన్ని వెంటనే అన్‌లోడింగ్‌ చేయాలని రైస్‌మిల్లర్లను కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం ధాన్యం కొనుగోలు, రవాణా అంశాలపై పౌర సరఫరాల అధికా రులు, రైస్‌మిల్లర్లు, ట్రాన్స్‌పోర్ట్‌ కాంట్రాక్టర్లతో సమీక్షించారు. రైస్‌మిల్లర్లు హమాలీల సంఖ్యను పెంచుకోవాలని, కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని వేగంగా అన్‌లోడింగ్‌ చేయించాలని ఆదేశించారు. అకాల వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున ధాన్యం తడవకుండా ఏర్పాట్లు చేయాలని ఆ దేశించారు. డీఆర్డీవో మచ్చ గీత, డీసీఎస్‌వో బుచ్చి బాబు, మేనేజర్‌ నరసింహ, డీసీవో టి.రామకృష్ణ, మెప్మా ఏవో మీర్జా ఫసహత్‌ అలీ బేగ్‌ పాల్గొన్నారు.

నేలల సంరక్షణ.. ఎరువుల వినియోగం కీలకం

తంగళ్లపల్లి(సిరిసిల్ల): వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించాలంటే నేలల సంరక్షణ, ఎరువుల సమతుల్య వినియోగం కీలకమని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ పేర్కొన్నారు. ’ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా తంగళ్లపల్లి మండలం తాడూర్‌లో సోమవారం నిర్వహించిన రైతు వారోత్సవాల అవగాహన సదస్సులో మాట్లాడారు. రైతులు తమ పొలంలో భూసార పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఎంత మోతాదులో ఎరువులు వాడాలనే అవగాహన వస్తుందన్నారు. ఇష్టారీతిన రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడడం ద్వారా నేల ప్రభుత్వం సన్న వడ్లకు బోనస్‌ ఇస్తుందని.. రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయిల్‌పామ్‌ సాగుపై దృష్టి సారించాలన్నారు. సదస్సు ప్రారంభంలో ’జయ జయహే తెలంగాణ’ గీతాన్ని ఆలపించి, నేలల సంరక్షణపై రైతులందరితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆదర్శ రైతులను సన్మానించారు. మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ నేరెళ్ల నర్సింగంగౌడ్‌, సర్పంచులు రెడ్డిమల్ల సదానందం, గుండు ప్రేమ్‌కుమార్‌, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం, ఉద్యానవన అధికారి శరత్‌, డీపీవో షర్ఫుద్దీన్‌, ఏఎంసీ డైరెక్టర్లు పొన్నాల పర్శరాములు, కల్లెపల్లి తిరుపతిరెడ్డి, అరెపల్లి బాలు, శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీవో మీర్జా అఫ్జల్‌ అహ్మద్‌ బేగ్‌, ఏవో సంజీవ్‌, ఆర్‌ఐ దినేశ్‌, నాయకులు లింగాల భూపతి, మిరాల శ్రీనివాస్‌, సురభి నవీన్‌రావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement