● అడిషనల్ ఎస్పీ చంద్రయ్య
సిరిసిల్ల: పోలీస్ అధికారులు, సిబ్బంది క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వహించాలని అడిషనల్ ఎస్పీ చంద్రయ్య సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయం పరేడ్ మైదానంలో జిల్లా ఏఆర్, సివిల్ పోలీస్, హోమ్‌గార్డ్ సిబ్బందికి శనివారం నిర్వహించిన వీక్లీ పరేడ్‌ను పరిశీలించారు. ప్రతి రోజూ కనీసం అరగంట వ్యాయామం, వాకింగ్ చేయాలన్నారు. డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ శ్రీనివాస్, ఆర్‌ఐలు మధుకర్, రమేశ్, ఆర్‌ఎస్సైలు రాజు, శ్రవణ్‌యాదవ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
‘జాన్ 2న ఇందిరమ్మ గృహప్రవేశాలు’
చందుర్తి(వేములవాడ): జిల్లా వ్యాప్తంగా జాన్ 2న ఇందిమ్మ ఇళ్ల మెగా గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనున్నట్లు హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకట మాధవరావు తెలిపారు. చందుర్తి మండల పరిషత్‌లో ఎంపీడీవో రాధ ఆధ్వర్యంలో శని వారం ఇందిరమ్మ ఇండ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. హౌసింగ్ పీడీ వెంకట మాధవరావు మాట్లాడుతూ ఇందిరమ్మ పథకంలో జిల్లాలో 6,449 ఇళ్లు మంజూరు చేయగా.. 5,756 గ్రౌండింగ్ కాగా.. 2,227 ఇండ్లు పూర్త య్యాయని, బేస్‌మెంట్‌లో 692, పునాది 819, గోడలు 395, స్లాబ్ వరకు 1,643 ఇండ్ల పనులు సాగుతున్నట్లు తెలిపారు. హౌసింగ్ డీఈఈ ముజారుద్దీన్, ఏఈ రవీందర్ ఉన్నారు.
సిరిసిల్లటౌన్: సిరిసిల్ల నుంచి హైదరాబాద్‌కు అదనపు బస్సులు నడపాలని బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ డిమాండ్ చేశారు. సిరిసిల్లలోని బస్టాండ్ ఎదుట శనివారం ధర్నా చేసి మాట్లాడారు. వేములవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే బస్సుల్లో సీట్లు దొరక్క సిరిసిల్లతోపాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా సిరిసిల్ల డిపో నుంచి బస్సులు వేయాలని కోరారు. మట్టే శ్రీనివాస్, ఆరెల్లి వినయ్‌కుమార్, సాదు శేఖర్, బల్యాల ప్రవీణ్, అజ్జు పాల్గొన్నారు.
పంచాక్షరికి స్వాగతం
సిరిసిల్లటౌన్: తెలంగాణ రాష్ట్ర లీగల్ సెల్ స ర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ సీహెచ్.పంచాక్షరి శనివారం సిరిసిల్లకు పర్యటనకు విచ్చేశారు. లోక్ అదాలత్ మెంబర్ చింతోజు భాస్కర్ పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు.
ఏఐపై వర్క్‌షాప్
సిరిసిల్ల: ఏఐ, లైఫ్‌స్కిల్స్‌పై నాలుగు రోజుల శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీసర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి శనివారం తెలిపారు. ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులు, యువకులు సాంకేతిక జ్ఞానంతో ఉద్యోగావకాశాలు మెరుగు పరుచుకోవాలని కోరారు. ‘మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్’ సహకారంతో వర్క్‌షాప్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని, సర్టిఫికెట్స్ జిరాక్స్‌లతో బీసీ స్టడీసర్కిల్ ఆఫీస్‌లో సంప్రదించాలని సూచించారు. అదనపు సమాచారం కోసం 08723–223004లో ఆఫీస్ పని వేళల్లో సంప్రదించాలని కోరారు.
నార్కోటిక్ జాగిలాలతో మత్తుకు చెక్
తంగళ్లపల్లి(సిరిసిల్ల): జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాలను నివారణే లక్ష్యంగా వపోలీసులు నార్కోటిక్ జాగిలాలతో సిరిసిల్లతోపాటు తంగళ్లపల్లి ప్రాంతాల్లోని కిరాణా కొట్లు, పాన్‌షాపులు, బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. అనుమానిత ప్రాంతాలపై నార్కోటిక్ డాగ్స్ సహాయంతో నిఘా ఉంచుతామన్నారు. ఇలాంటి అసాంఘిక, అక్రమ వ్యవహారాలు జరుగుతుంటే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు.


