ఎమర్జెన్సీగా నవజాత శిశువులకు సంబంధించిన అత్యవసర అంబులెన్స్ సేవలు 24 గంటలపాటు అందుబాటులో ఉన్నాయి. నవజాత శిశువుకు ఏర్పడే జన్యుపరమైన వ్యాధుల నుంచి సత్వరమే వైద్యం అందించాలంటే ప్రజలు వెంటనే 108కు సమాచారం ఇస్తే సరిపోతుంది. అంబులెన్స్ సిబ్బంది వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలోకి వెళ్లి వైద్యం అందిస్తారు.
– అరుణ్‌కుమార్, జిల్లా మేనేజర్
సీపీఆర్ సేవలు అందించాం
కొన్ని సందర్భాల్లో సీపీఆర్ ద్వారా శిశువులను బతికించాం. నవజాత శిశువులకు ఏదైనా చికిత్స అవసరం అన్న సమాచారం అందిన వెంటనే స్పందిస్తాం. వారి సంరక్షణకే సిబ్బంది ప్రాధాన్యత ఇస్తుంది. ఎంతోమంది శిశువులను సకాలంలో ఆస్పత్రులకు చేర్చుతున్నాం. ఆధునిక సదుపాయాలతో ఎన్నో ప్రాణాలను కాపాడగలిగాం. – మామిడాల ఆంజనేయులు,
సీనియర్ పైలట్
వినియోగించుకోవాలి
ప్రజలు 108 సేవలు సద్వినియోగం చేసుకోవాలి. నవజాత శిశువుల చికిత్సకు నియోనాటల్ కేర్ అంబులెన్స్‌లో అత్యాధునిక పరికరా లున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో శిశువులను సకాలంలో ఆస్పత్రికి చేర్చి అనేక ప్రాణాలను కాపాడాం. పసిపిల్లల రక్షణకు అన్ని వేళల్లో వైద్యసేవలకు మేము సిద్ధంగా ఉంటాం.
– పెద్ది శ్రీనివాస్,
పైలట్ నియోనాటల్ అంబులెన్స్


