మిల్లుల్లో హమాలీల సంఖ్య పెంచాలి | - | Sakshi
Sakshi News home page

మిల్లుల్లో హమాలీల సంఖ్య పెంచాలి

May 8 2026 1:13 PM | Updated on May 8 2026 1:13 PM

● కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

సిరిసిల్ల: జిల్లాలోని రైస్‌మిల్లుల్లో హమాలీల సంఖ్యను పెంచి వేగంగా ధాన్యం కొనుగోళ్లు జరిగేలా చూడాలని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని సర్దాపూర్‌ మార్కెట్‌ కమిటీ ఆవరణలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని గురువారం తనిఖీ చేశారు. ధాన్యం రాశులు పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. మిల్లర్లు హమాలీల సంఖ్యను పెంచి వెంటవెంటనే ధాన్యం అన్‌లోడింగ్‌ చేయాలని ఆదేశించారు. ఆర్డీవో వెంకటేశ్వర్లు, జిల్లా పౌర సరఫరాల మేనేజర్‌ నరసింహ, మెప్మా ఏవో మీర్జా ఫసహత్‌ అలీ బేగ్‌, తహసీల్దార్‌ జయంత్‌కుమార్‌ పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లపై టెలీకాన్ఫరెన్స్‌

ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్‌ అన్ని మండలాల అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

9న జనగణనపై మారథాన్‌

స్వీయ గణనకు మే 10వ తేదీ చివరిది కావడంతో అందరూ స్వీయగణనను చేసుకోవాలని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ కోరారు. ఈనెల 9న జనగణనపై జిల్లా కేంద్రంలో మారథాన్‌ రన్‌ నిర్వహించాలని అధికారులకు సూచించారు. జనగణనపై రాష్ట్ర సంచాలకులు భారతి హోళికేరి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. సీపీవో పీ.బీ.శ్రీనివాసాచారి, డీపీవో షరీపొద్దీన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఖధీర్‌పాషా, కలెక్టరేట్‌ ఏవో రాంరెడ్డి, ఈడీఎం శ్రీనివాస్‌, ఎస్‌వో సంపత్‌కుమార్‌, మెప్మా ఏవో మీర్జా ఫసహత్‌ అలీ బేగ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement