రాష్ట్ర ప్రగతికి కేంద్రం పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ప్రగతికి కేంద్రం పెద్దపీట

May 9 2026 9:43 AM | Updated on May 9 2026 9:43 AM

● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి

● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి

సిరిసిల్లటౌన్‌: తెలంగాణ సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. సిరిసిల్లలోని తన నివాసంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా మే 10న తెలంగాణ పర్యటనకు వస్తున్నారని తెలిపారు. సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా రూ.7,823 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి, పలు ప్రాజెక్టులను తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తారని తెలిపారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్‌, జిల్లా ఉపాధ్యక్షుడు శీలం రాజు, జిల్లా కోశాధికారి ఆసాని రామలింగారెడ్డి, మెరుగు శ్రీనివాస్‌, సీనియర్‌ నాయకులు గజభీంకార్‌ చందు, ఊరగొండ రాజు, ఎర్రం విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement