బక్రీద్‌కు పటిష్ట భద్రత | - | Sakshi
Sakshi News home page

బక్రీద్‌కు పటిష్ట భద్రత

May 16 2026 4:53 AM | Updated on May 16 2026 4:53 AM

సిరిసిల్లటౌన్‌: బక్రీద్‌కు జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ మహేశ్‌ బీ గీతే తెలిపారు. బక్రీద్‌ నేపథ్యంలో శుక్రవారం ముస్లిం మత పెద్దలతో జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సమావేశమయ్యారు. బక్రీద్‌ పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. సరైన పత్రాలు లేకుండా పశువులను తరలించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆవులు, దూడలను అక్రమంగా రవాణా చేసిన, వధించిన, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. పశువుల అక్రమ రవాణాను గుర్తిస్తే వెంటనే హెల్ప్‌లైన్‌ నంబర్‌ 87125 37826, నోడల్‌ అధికారి స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ 87126 56410కు సమాచారం ఇవ్వాలని కోరారు. డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement