ఆస్తిపన్నులో అగ్రస్థానం | - | Sakshi
Sakshi News home page

ఆస్తిపన్నులో అగ్రస్థానం

May 12 2026 1:32 AM | Updated on May 12 2026 1:32 AM

మండలాల వారీగా ఆస్తి పన్ను వసూళ్ల తీరు

పంచాయతీలు

ఇది జిల్లాలోని మూరుమూల కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామపంచాయతీ భవనం. ఈ ఊరిలో 1,040 ఇండ్లు ఉండగా.. రూ.5లక్షలకు పైగా ఆస్తి పన్ను ఏటా వసూలు చేయాల్సి ఉంది. స్థానిక గ్రామపంచాయతీ పాలకవర్గం, పంచాయతీ కార్యదర్శి రాధిక సంయుక్త కార్యాచరణతో 2026 మార్చి నెలాఖరులోగా వంద శాతం ఇంటి, నల్లా పన్నులను వసూలు చేశారు. ఇలా జిల్లాలోని 260 గ్రామపంచాయతీల్లోనూ వందశాతం ఆస్తి పన్ను వసూలు చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది.

మండలం గ్రామ గృహాలు వసూలైన పన్ను

బోయినపల్లి 23 12,693 రూ.53,80,713

చందుర్తి 19 8,301 రూ.53,35,461

ఇల్లంతకుంట 35 18,089 రూ.59,49,606

గంభీరావుపేట 22 15,935 రూ.84,57,413

కోనరావుపేట 28 16,311 రూ.49,07,736

ముస్తాబాద్‌ 22 16,150 రూ.1,18,09,857

రుద్రంగి 10 5,801 రూ.31,47,339

తంగళ్లపల్లి 30 17,063 రూ.97,61,617

వీర్నపల్లి 17 4,689 రూ.19,59,183

వేములవాడ అర్బన్‌ 11 5,527 రూ.76,24,088

వేములవాడ రూరల్‌ 17 8,512 రూ.28,63,577

ఎల్లారెడ్డిపేట 26 15,707 రూ.1,21,79,553

Advertisement
 
Advertisement
Advertisement