● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: జిల్లాలో టీజీఈడబ్ల్యూఐడీసీ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖల ఆధ్వర్యంలో చేపట్టి తుదిదశలో ఉన్న భవనాల పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్‌లో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యాశాఖ వారోత్సవాలను షెడ్యూల్ ప్రకారం ఘనంగా నిర్వహించాలని సూచించారు. టీజీఈడబ్ల్యూఐడీసీ ఆధ్వర్యంలో పూర్తయిన అదనపు తరగతి భవనాలు తదితర పనులు 21 పూర్తయ్యాయని, విద్యాశాఖ వారోత్సవాల్లో పండుగ వాతావరణంలో ప్రారంభించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో టాయిలెట్లు నిర్మాణాలు త్వరగా పూర్తి చేసి, విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి సిద్ధం చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ ఎస్‌ఈ గిరీశ్‌బాబు, టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ అశోక్‌కుమార్, జిల్లా విద్యాధికారి జగన్‌మోహన్‌రెడ్డి, జీసీడీవో పద్మజ తదితరులు పాల్గొన్నారు.


