సిరిసిల్ల: పోలీసులు బాధితులకు అండగా నిలవాలని ఎస్పీ మహేశ్ బీ గీతే సూచించారు. జిల్లా పోలీస్ ఆఫీస్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేకు 21 ఫిర్యాదులు వచ్చాయి. గ్రీవెన్స్‌కు వచ్చిన ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేసి, సమస్య ఏ మేరకు పరిష్కారమైందో పర్యవేక్షిస్తామన్నారు.
పశువుల అక్రమ రవాణాపై నిఘా
జిల్లాలో పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీస్‌శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని ఎస్పీ తెలిపారు. జిల్లా పరిధిలో మూడు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పశువుల అక్రమ రవాణాపై నిఘా పెట్టినట్లు తెలిపారు. పశువుల అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలపాలన్నారు.


