● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: ప్రతీ ఒక్కరికి కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే లక్ష్యమని విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం విద్యావారోత్సవాలు ప్రారంభించారు. విప్ మాట్లాడుతూ ప్రతీ నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్‌స్కూల్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే క్యాంపస్‌లో విద్య అందుతుందన్నారు. విద్యతోపాటు క్రీడలు, వ్యక్తిత్వ వికాసం, టెక్నాలజీ ఆధారిత అభ్యాసంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు వివరించారు. ఈనెల 25 వరకు కొనసాగే వేసవి శిబిరాల్లో విద్యార్థులకు కోడింగ్, కళలు, క్రీడలు, యోగా, వ్యక్తిత్వ వికాసంలో శిక్షణ ఇస్తారని తెలిపారు.
సొంతింటి కల నిజం చేయడమే లక్ష్యం
కోనరావుపేట/వేములవాడరూరల్/రుద్రంగి: పేదల సొంతింటి కల నిజం చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. గోవిందరావుపేట, ఆరెపల్లి, రుద్రంగి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి, లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతీ కుటుంబానికి నివాసం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సర్పంచులు భుక్యా తిరుపతి, బానోత్ నరేశ్, పన్నాల లక్ష్మారెడ్డి, దేవరాజు, బాదవేణి మురళి, రుద్రంగి సర్పంచ్ గండి లక్ష్మీనారాయణ, ఏఎంసీ చైర్మన్ తిరుపతి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు షేక్ ఫిరోజ్‌పాషా, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఎల్లయ్య, వైస్ చైర్మన్ ప్రభాకర్ పాల్గొన్నారు.


