వైభవంగా వేంకటేశ్వరుని కల్యాణం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా వేంకటేశ్వరుని కల్యాణం

May 10 2026 9:46 AM | Updated on May 10 2026 9:46 AM

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని దుమాలలో భూదేవి, శ్రీదేవి సహిత శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రూ.కోటిన్నర వ్యయంతో నిర్మించిన నూతన ఆలయాన్ని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ప్రారంభించారు. విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ పాత రోజుల్లో ప్రతీ గ్రామంలో బడి, గుడి ఉండేవని.. వాటి ద్వారా ప్రజల్లో చదువు, ఆధ్యాత్మికత వెల్లివిరిసేదన్నారు. ఆలయాన్ని అద్భుతంగా నిర్మించడంలో ముందున్న సర్పంచ్‌ శరవిందు, ఉపసర్పంచ్‌ విశాల్‌, ఆలయ కమిటీ చైర్మన్‌ బాలయ్యతో పాటు గ్రామస్తులను అభినందించారు. అనంత రం ఆలయ కమిటీ స్వామివారి చిత్రపటాలు, శాలు వాలతో ప్రభుత్వ విప్‌తోపాటు నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి మహేందర్‌రెడ్డిలను సన్మానించారు. ఏఎంసీ చైర్‌పర్సన్‌ సాబేరబేగం, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్‌ గుల్లపల్లి నర్సింహారెడ్డి, మాజీ ఎంపీటీసీ శంకర్‌లు, బాలకిషన్‌, మాజీ సర్పంచ్‌ కదిరె శ్రీనివాస్‌గౌడ్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement