చందుర్తి(వేములవాడ): ధాన్యం తరలింపులో జాప్యాన్ని నిరసిస్తూ ఆందోళనకు సిద్ధమైన మండలంలోని మల్యాలకు చెందిన రైతులను సోమవారం చందుర్తి పోలీసులు అడ్డుకున్నారు. ధా న్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి 50 రో జులు గడుస్తున్నా లారీలు రాకపోవడంతో ఆగ్రహించిన రైతులు రోడ్డెక్కేందుకు సిద్ధమయ్యా రు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై రమేశ్ తన సిబ్బందితో మల్యాలకు వెళ్లి రైతులకు నచ్చజెప్పారు. సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి లారీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇ వ్వడంతో రైతులు వెనుదిరిగారు. ఈ విషయం తెలుసుకున్న ఐకేపీ ఏపీఎం కల్యాణి , చందుర్తి తహసీల్దార్ భూపతి మల్యాల గ్రామానికి చేరుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు వేసి ధాన్యం బస్తాలను లారీ, రెండు ట్రాక్టర్లల్లో లోడు చేసి రైస్‌మిల్లులకు తరలించారు.
సిరిసిల్లటౌన్: దంపతుల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు జరుగుతున్నాయని, ఇగోకు పోయి సంసారాలను పాడు చేసుకోవద్దని సైకా లజిస్ట్ కె.పున్నంచందర్ సూచించారు. జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్‌లో సోమవారం మనో వికాస సదస్సు నిర్వహించారు. కౌన్సెలింగ్ ద్వా రా పరస్పర అవగాహన పెంపొందించుకోవచ్చన్నారు. ఫ్యామిలీ కౌన్సెలింగ్ కోసం 88018 88805, నేరుగా మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్‌లో సంప్రదించాలి సూచించారు. మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ సిబ్బంది బూర శ్రీమతి, కొండ ఉమ, రాపెల్లి లత పాల్గొన్నారు.
సిరిసిల్లటౌన్: యజమానులు తమతో కూలీ పెంపు ఒప్పందం చేసే వరకు నిరవధిక సమ్మె కొనసాగుతోందని ఆసాముల సంక్షేమ సంఘం కన్వీనర్ సిరిసిల్ల రవీందర్ పేర్కొన్నారు. సిరిసిల్లలోని వస్త్రోత్పత్తిదారుల సంఘం ఎదుట సోమవారం ధర్నా చేశారు. ఆసాములతో అగ్రిమెంటు జరిగిందన్న వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు. ఇప్పటి వరకు ఆసాముల సంఘంతో ఒప్పందం కుదురలేదని స్పష్టం చేశారు.


