ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు త్వరగా తరలించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం రాశులను ఆదివారం పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. మిల్లర్లు హమాలీల సంఖ్యను పెంచి వెంటవెంటనే ధాన్యం అన్‌లోడింగ్ చేయాలని ఆదేశించారు. లారీల ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్లు వాహనాల సంఖ్య పెంచాలని, ధాన్యానికి అనుగుణంగా సమకూర్చాలని ఆదేశించారు. ధాన్యం తడవకుండా టార్పాలిన్లను అందుబాటులో పెట్టాలని సూచించారు. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ఉండేలా చూసుకోవాలన్నారు. అనంతరం మండలంలోని రాచర్లబొప్పాపూర్‌లోని ఏఎంసీ గోదాంను పరిశీలించి, అన్‌లోడింగ్ వేగంగా చేయాలని సూచించారు. డీఆర్డీవో లక్ష్మీనారాయణ, జిల్లా పౌర సరఫరాల అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, తహసీల్దార్ సుజాత తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ గరీమా అగ్రవాల్


