● మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ
సిరిసిల్ల అర్బన్: మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తామని మున్సిపల్ చైర్‌పర్సన్ జింద కళ పేర్కొన్నారు. 9వ వార్డులో స్థానిక కౌన్సిలర్ దొంతరవేణి కళ్యాణితో కలిసి రూ.3లక్షలతో చేపట్టే పోచమ్మ గుడి అభివృద్ధి పనులకు శనివారం భూమి పూజ చేశారు. వైస్‌చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్లు ఎలుక వెంకటేశం, బత్తుల రమేశ్, మాజీ కౌన్సిలర్లు సత్యనారాయణ, పూర్ణచందర్, అశోక్‌రావు, సంపత్, సాయికృష్ణ, సింగిల్‌విండో చైర్మన్ జెల్ల కిషన్ పాల్గొన్నారు.
వీహెచ్ దీక్షకు ‘సంగీతం’ సంఘీభావం
సిరిసిల్లటౌన్: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపడుతున్న జనగణనలో ఓబీసీలను కూడా లెక్కించాలన్న వీహెచ్ దీక్షకు డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ సంఘీభావం తెలిపారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో శనివారం ఓబీసీ ఎంపీల ఫోరం మాజీ కన్వీనర్, రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హనుమంతరావు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీల అభ్యున్నతికి, బీసీ జనాభా ప్రతిపాదికగా న్యాయం జరగాలంటే జనగణనలో బీసీ జనాభా కూడా లెక్కించాలని డిమాండ్ చేశారు. వీహెచ్‌కు పూలదండ వేసి మద్దతు పలికారు.
వినియోగదారులకు ‘వాట్సాప్ చాట్‌బాట్’ సేవలు
వేములవాడ: ఎన్పీడీసీఎల్ వినియోగదారులకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందిస్తున్నామని జిల్లా సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ టి. వేణుమాధవ్ శనివారం తెలిపారు. ఈనెల 8 నుంచి వాట్సాప్ చాట్‌బాట్(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) సేవలు ప్రారంభించినట్లు వివరించారు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో సమాధానం తెలుసుకోవచ్చన్నారు. విద్యుత్ బిల్లులు, ఫిర్యాదులు, విద్యుత్ అంతరాయ సమాచారం వంటివి తెలుసుకోవచ్చని తెలిపారు. 87124 81489 ద్వారా వాట్సాప్‌లోకి వెళ్లి కావలసిన సేవలను సులభంగా పొందవచ్చన్నారు. నేరుగా ఈ లింక్‌పై https://wa.me/918712481 489 క్లిక్ చేయవచ్చని తెలిపారు.
ఐడీటీఆర్‌లో డ్రైవర్లకు రిఫ్రెషర్ ట్రెయినింగ్
సిరిసిల్ల అర్బన్: డ్రైవర్ల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు మూడు రోజుల రిఫ్రెషర్ ట్రెయినింగ్‌ను ఐడీటీఆర్‌లో నిర్వహిస్తున్నట్లు ప్రిన్సి పాల్ తెలిపారు. తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన తాజా సర్క్యులర్ ప్రకారం డ్రైవర్లు, స్కూల్, కాలేజీ బస్ డ్రైవర్లు, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ అయిన డ్రైవర్లు ఈ శిక్షణ తప్పనిసరిగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. ప్రతీ సోమవారం, గు రువారం కొత్త బ్యాచ్‌లతో ప్రారంభమవుతుందని, ప్రతీ బ్యాచ్‌లో 100 మంది డ్రైవర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. వివరాలకు 89 854 31720లో సంప్రదించాలని సూచించారు.
11న సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
సిరిసిల్ల అర్బన్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 11 నుంచి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ప్రధాన కార్యదర్శి బొజ్జ చంద్రశేఖర్ తెలిపారు. ఈ పోటీల్లో 8, 10, 12, 14 ఏళ్ల బాల, బాలికలకు ఎంపిక పోటీలు సిరిసిల్ల జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 17న హైదరాబాద్‌లో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు.


