ఈ చిత్రం సిరిసిల్ల శివారులోని ఇప్పలపల్లె ప్రాంతం. గుంపులుగా మహిళలు వెళ్లి కిలోమీటరు దూరంలో ఉన్న కరెంటు మోటారు నుంచి నీటిని ఎత్తుకొస్తున్నారు. ఇక్కడి బోర్లలో నీరడుగంటి పోతున్నాయి. 200 కుటుంబాల్లో సుమారు వేయి మంది ఎండాకాల కన్నీటి కష్టాలు పడుతున్నారు. పలుసార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సిరిసిల్లలో మిషన్ భగీరథ స్వరూపం
జనాభా : 1,10,000
వార్డులు : 39
నివాసాలు : 31,601
నల్లాలు : 16,510
పైపులైన్ పొడవు : 139.80 కిలోమీటర్లు
అంతర్గత పైపులైన్ : 130.5 కిలోమీటర్లు
ప్రధాన పైపులైన్ : 9.5 కిలోమీటర్లు
నిర్మాణ వ్యయం : రూ.60 కోట్లు


