నిధులు మంజూరు కాగానే.. | - | Sakshi
Sakshi News home page

నిధులు మంజూరు కాగానే..

May 4 2026 10:19 AM | Updated on May 4 2026 10:19 AM

నిధులు మంజూరు కాగానే.. వేతనాలు విడుదల చేయాలి అధికారులు స్పందించాలి

నిధులు మంజూరు కాగానే పంచాయతీ కార్మికులకు పెండింగ్‌ వేతనాలు అందజేస్తాం. చిన్న పంచాయతీల్లో కొంత ఇబ్బంది ఉన్నా వారికి కూడా త్వరలోనే వేతనాలు మంజూరు చేస్తాం.

– షరీఫొద్దీన్‌,

జిల్లా పంచాయతీ అధికారి

ముస్తాబాద్‌ మండలం రామ్‌రెడ్డిపల్లె గ్రామం. నేను ఐదేళ్లుగా పంచాయతీ కార్మికుడిగా పనిచేస్తున్నా. మూడునెలలుగా జీతం రావడం లేదు. అధికారులు స్పందించి పెండింగ్‌లో ఉన్న వేతనం మంజూరు చేయాలి.

– గద్దల సుధాకర్‌,

కార్మికుడు, రామ్‌రెడ్డిపల్లె, ముస్తాబాద్‌

పంచాయతీ కార్మికులకు పెండింగ్‌ వేతనాలు వెంటనే విడుదల చేయా లి. కొన్ని పంచాయతీల్లో మూడు నుంచి ఆరునెలలుగా వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. అధికారులు స్పందించి త్వరగా మంజూరు చేయాలి. – అన్నల్‌దాస్‌ గణేశ్‌,

గ్రామపంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా బాధ్యులు

Advertisement
 
Advertisement
Advertisement