భవిష్యత్‌లో ఉన్నతస్థాయిలో నిలవాలి | - | Sakshi
Sakshi News home page

భవిష్యత్‌లో ఉన్నతస్థాయిలో నిలవాలి

May 1 2026 7:56 AM | Updated on May 1 2026 7:56 AM

అనాథలకు అండగా ‘మిషన్‌ వాత్సల్య’

ఇల్లంతకుంట(మానకొండూర్‌): విద్యార్థులు భవిష్యత్‌లో ఉన్నత స్థాయిలో నిలవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. ఇల్లంతకుంట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థిని మాందాడి హనీ పదో తరగతిలో 586 మార్కులతో సొసైటీ స్థాయిలో రాష్ట్రంలో రెండో ర్యాంకు సాధించడంతో మంత్రి గురువారం హైదరాబాద్‌లో సన్మానించారు. క్రమశిక్షణతో మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థిని ప్రిన్సిపాల్‌ సంధ్యారాణి, ఉపాధ్యాయులు అభినందించారు.

నిరసన దీక్ష విజయవంతం చేయాలి

సిరిసిల్ల: ఉద్యోగుల డిమాండ్‌ల సాధనలో భాగంగా ఈ నెల 5న రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే దీక్ష సమరాన్ని విజయవంతం చేయాలని టీజీఈజేఏసీ రాష్ట్ర చైర్మన్‌ మారం జగదీశ్వర్‌ కోరారు. జిల్లా కేంద్రంలోని అర్బన్‌బ్యాంకులో గురువారం ఉద్యోగ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లాను ఉద్యమ ఖిల్లాగా పేరుందని, ఆ పేరును నిలబెట్టుకునేలా దీక్షలు చేపట్టాలన్నారు. నిరసన దీక్షలలో ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. జేఏసీ చైర్మన్‌ ఎలుసాని ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని శాఖల ఉద్యోగ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున హాజరై నిరసన దీక్షను విజయవంతం చేస్తామన్నారు. జేఏసీ కార్యదర్శి సమరసేన, టీజీవో, టీఎన్‌జీవో నాయకులు సయ్యద్‌ జబీ, అహ్మద్‌రసూల్‌, గాజుల సుదర్శన్‌, ఎండీ రియాజ్‌, మెట్టు శ్రీకాంత్‌, ఆర్‌.శేఖర్‌, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పెన్షనర్స్‌ పాల్గొన్నారు.

బోయినపల్లి(చొప్పదండి): అనాథలకు అండగా మిషన్‌ వాత్సల్య విభాగం కృషి చేస్తుందని జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం తెలిపారు. పజా పాలన ప్రగతి ప్రణాళిక, బాలల భద్రత డ్రగ్స్‌ రహిత తెలంగాణ వారోత్సవాల్లో భాగంగా గురువారం మండలంలోని కొదురుపాకలో నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో తల్లిదండ్రుల సపోర్ట్‌ లేని వారి వివరాలు సేకరించగా మొత్తం 302 మంది పిల్లలు ఉన్నారని గుర్తించడం జరిగిందన్నారు. వీరికి జనన ధ్రువీకరణ, తల్లిదండ్రుల మరణ ధ్రువీకరణ పత్రాలు, కులము, ఆదాయం, బ్యాంక్‌ అకౌంట్‌, ఆధార్‌ లాంటివి అందించడానికి కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. పిల్లల దత్తతకు చట్ట ప్రకారం ముందుకెళ్లాలని సూచించారు. అక్రమంగా పిల్లలను కొనుగోలు చేసినా, విక్రయించినా చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. పిల్లలను పెంచడానికి ఏవైనా సంస్థలు ముందుకు వస్తే వారి వివరాలు ప్రభుత్వానికి పంపి ఆన్‌లైన్‌లో నమోదు కోసం సాయం అందిస్తామన్నారు. అడిషనల్‌ సీడీపీవో సుచరిత, జిల్లా విమెన్‌ హబ్‌ కోఆర్డినేటర్‌ రోజా, డిస్ట్రిక్ట్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ కవిత, లీగల్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ అంజయ్య, తహసీల్దార్‌ షరీఫ్‌ మోయినొద్దిన్‌, ఎంపీడీవో జయశీల, ఎస్సై రమాకాంత్‌, సర్పంచు కత్తెరపాక మంజుల, ఉపసర్పంచు గోపాల్‌, ఎంఈవో శ్రవణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయికి మూడు

స్టడీ ప్రాజెక్టులు ఎంపిక

గంభీరావుపేట(సిరిసిల్ల): మండలకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ అండ్‌ పీజీ కళాశాల నుంచి మూ డు జిజ్ఞాస స్టూడెంట్‌ ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయి. ఇంగ్లిష్‌, కెమిస్ట్రీ, బోటనీ సబ్జెక్టుల నుంచి ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ విజయలక్ష్మి తెలిపారు. సంబంధిత విద్యార్థులను ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement