సిరిసిల్లలో ట్రాక్టర్లకు పనులు లేక ఇబ్బందుల్లో ఉన్నాం. ఆన్‌లైన్ ద్వారా ఇసుక పర్మిట్లు ఇస్తున్నారు. దీంతో ట్రాక్టర్లకు పూర్తి స్థాయి పనులు లేవు. ఇప్పుడు డీజిల్ ధరలు పెరగడంతో ఆర్థిక భారం పడుతుంది. ఒక్క ట్రాక్టర్ యజమానులే కాదు.. మాపై ఆధార పడిన దినసరి కూలీలు కూడా ఇబ్బందులు పడుతారు.
– పాటి రాజ్‌కుమార్, ట్రాక్టర్ అసోసియేషన్, అధ్యక్షుడు, సిరిసిల్ల
అందరికీ భారమే..
వ్యవసాయదారుల నుంచి అన్ని రంగాల వారిపైన డీజిల్, పెట్రోల్ ధరల పెంపు ప్రభావం ఉంటుంది. ఇప్పటికే సిలిండర్ల కొరతతో హోటళ్లలో టిఫిన్ రేట్లు పెంచారు. ఇప్పుడు డీజిల్, పెట్రోల్ ధరలు పెరడంతో సామాన్యులకు ఇబ్బందులు తప్పవు. ఇది అందరికీ పెద్ద ఆర్థిక భారమే అవుతుంది.
– దొంతరవేణి శ్రీనివాస్‌గౌడ్,
గీత కార్మికుడు, నిమ్మపల్లి
పెరిగిన ధరలు అమలు చేస్తున్నాం
ఇంధన కంపెనీల నిర్ణయం మేరకు పెరిగిన ధరలను అమలు చేస్తున్నాం. పెట్రోల్, డీజిల్ బంకులు ప్రస్తుత విధానాలతో ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. నిజానికి ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. కానీ ప్రభుత్వ నిర్ణయాలను మేం అమలు చేయాల్సిందే. పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలు వెంటనే అమలులోకి వచ్చాయి.
– గూడూరి ప్రవీణ్,
పెట్రోల్ బంక్ యజమాని, సిరిసిల్ల


