ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు

May 13 2026 1:56 AM | Updated on May 13 2026 1:56 AM

● నేటి నుంచి పరీక్షలు రాయనున్న 4,200 మంది విద్యార్థులు

● నేటి నుంచి పరీక్షలు రాయనున్న 4,200 మంది విద్యార్థులు

సిరిసిల్ల: జిల్లాలో ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి సీహెచ్‌.శరత్‌కుమార్‌ మంగళవారం తెలిపారు. బుధవారం నుంచి ఈనెల 20 వరకు పరీక్షలు జరుగుతాయని వివరించారు. ఫస్టియర్‌లో 2,599, సెకండియర్‌లో 1,601 మొత్తం 4,200 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని పేర్కొన్నారు. ఫస్టియర్‌ విద్యార్థులకు ఉదయం 9 నుంచి 12, సెకండియర్‌ విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 చి 5.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షల నిర్వహణకు 200 మంది ఇన్విజిలేటర్లు, రెండు సిట్టింగ్‌ స్క్వాడ్‌, ఒక ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను ఏర్పాటు చేశామని వివరించారు. విద్యార్థులు హాల్‌ టికెట్లను టీజీఈ వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని, దానిపై ప్రిన్సిపాల్‌ సంతకం అవసరం లేదన్నారు. హాల్‌ టికెట్లలో పరీక్షా కేంద్ర స్థానం కోసం క్యూఆర్‌ కోడ్‌ అందుబాటులో ఉంటుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement