శుక్రవారం శ్రీ 1 శ్రీ మే శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

శుక్రవారం శ్రీ 1 శ్రీ మే శ్రీ 2026

May 1 2026 7:56 AM | Updated on May 1 2026 7:56 AM

శుక్రవారం శ్రీ 1 శ్రీ మే శ్రీ 2026

న్యూస్‌రీల్‌

కల్యాణ వైభోగమే..

వేములవాడఅర్బన్‌: వేములవాడ రాజన్న దత్తత ఆలయం నాంపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో గురువారం కల్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, ఆలయ ఈవో రమాదేవి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఉదయం 10.30 గంటలకు శ్రీభూనీలా సమేత లక్ష్మీనరసింహస్వామి కల్యాణం వైభవంగా నిర్వహించారు. కన్యదాతలుగా రాచకొండ రామాచార్యులు సంధ్య, కల్యాణోత్సవ దాతలుగా కరీంనగర్‌కు చెందిన కోటోజు శ్రీనివాస్‌ సుష్మ వ్యవహరించారు. స్వామివారిని మున్సిపల్‌ చైర్మన్‌ పుల్కం రాజు, వైస్‌ చైర్మన్‌ నరాల శేఖర్‌, కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు ఏనుగు మనోహర్‌రెడ్డి తదితరులు దర్శించుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement