● కరీంనగర్ గ్యాస్ లారీని అడ్డుకున్న డీలర్లు ● సివిల్ సప్లై అధికారికి ఫిర్యాదు
సిరిసిల్లటౌన్: జిల్లాలో కరీంనగర్‌కు చెందిన గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు అక్రమ నిల్వలకు పాల్పడుతున్నారని సిరిసిల్లలోని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు ఆరోపించారు. ఈమేరకు కరీంనగర్ నుంచి సిరిసిల్లకు బుధవారం వచ్చిన ఓ గ్యాస్ ఏజెన్సీ లారీని అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పౌరసరఫరాలశాఖ డిప్యూటీ తహసీల్దార్ రజిత అక్కడికి చేరుకున్నారు. ఆమెతో స్థానిక గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు మాట్లాడుతూ కరీంనగర్ నుంచి లారీలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను అక్రమంగా ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నారన్నారు. ఈవిషయంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
డీఎస్‌వోకు నివేదించాం
సంఘటనపై క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాం. ఇరువర్గాలకు పౌర సరఫరాల శాఖ కార్యాలయానికి రావాలని సూచించాం. సిరిసిల్లలోని డీలర్ల ఫిర్యాదులను జిల్లా పౌర సరఫరాల అధికారికి నివేదించాం. ఉన్నతాధికారుల తదుపరి ఉత్తర్వులను అమలు చేస్తాం. – రజిత, సివిల్ సప్లై, డీటీ


