● బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ కొత్తకోట సీతాదయాకర్‌రెడ్డి
సిరిసిల్ల: బాలల హక్కుల రక్షణ అందరి బాధ్యత అని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ కొత్తకోట సీతాదయాకర్‌రెడ్డి పేర్కొన్నారు. సీ్త్ర, మహిళా, శిశు, వృద్ధుల, దివ్యాంగుల, ట్రాన్స్‌జెండర్స్ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఫంక్షన్‌హాల్‌లో బాలల హక్కుల పరిరక్షణపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సీతాదయాకర్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాలు, వార్డుల్లో బాలల హక్కుల పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. బాల్య వివాహాలు అడ్డుకోవాలని సూచించారు. పాఠశాలల్లో డ్రాపౌట్స్ ఉండొద్దని సూచించారు. బాలకార్మిక వ్యవస్థ ఉండవద్దని స్పష్టం చేశారు. 1098 హెల్ప్‌లైన్ వినియోగించుకోవాలని తెలిపారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ 18 ఏళ్లలోపు బాల, బాలికలను కమిటీలు సంరక్షించాలని సూచించారు. జిల్లాలో వందకుపైగా అంగన్‌వాడీ భవనాలు నిర్మిస్తున్నామని వెల్లడించారు. లింగ నిర్ధారణ పరీక్షలు నేరమన్నారు. అనాథలకు ప్రభుత్వం మిషన్ వాత్సల్య కింద ప్రతి నెలా రూ.4వేలు సహాయం అందిస్తుందని, జిల్లాలో 117 మంది పిల్లలకు ప్రతి నెలా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు వచన్‌కుమార్‌రెడ్డి, బండి అపర్ణ, మర్రిపల్లి చందన, గోగుల సరిత, వందనగౌడ్, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి, ఏఎంసీ చైర్మన్లు స్వరూపారెడ్డి, రాములునాయక్, రాజు, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, సిరిసిల్ల ఆర్డీవో రాజేందర్‌రెడ్డి, డీఎస్పీ నాగేంద్రచారి పాల్గొన్నారు.


