ఇది ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్ మార్కెట్. ఇక్కడ పది రోజుల క్రితం తూకం వేసిన ధాన్యం బస్తాలు అలాగే ఉండిపోయాయి. వాహనాలు దొరకడం లేదు. అలాగే సింగారం కొనుగోలు కేంద్రానికి 15 రోజుల క్రితం ధాన్యం తీసుకొస్తే.. వాహనాల కొరతతో తూకం వేయలేదు. మరో వైపు తూకం వేసిన ధాన్యం బస్తాలను మిల్లులకు తరలిద్దామంటే వాహనాలు దొరకడం లేదు.
ఇతను ఎల్లారెడ్డిపేట మండలం పదిరకు చెందిన రైతు కంచర్ల నర్సయ్య. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే 42.300 కిలోల చొప్పున తూకం వేస్తున్నారు. గతంలో 42.100 కిలోల చొప్పున తూకం వేసేవారు. ఈ సీజన్‌లో రైస్‌మిల్లర్ల షరతులతో నిర్వాహకులు రైతుల నుంచి 200 నుంచి 300 గ్రాముల వరకు అధికంగా తూకం వేస్తున్నారు.


