హనుమాన్‌కు క్షీరాభిషేకం | - | Sakshi
Sakshi News home page

హనుమాన్‌కు క్షీరాభిషేకం

May 10 2026 9:46 AM | Updated on May 10 2026 9:46 AM

వేములవాడ: రాజన్న అనుబంధ నగరేశ్వరస్వామి ఆలయంలో హనుమాన్‌ భక్తులు శనివారం ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం వేములవాడ పట్టణ వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ‘జై శ్రీ రామ్‌’ నామం మారుమోగింది. ఆలయ ఈవో రమాదేవి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుల్కం రాజు, మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ కనకరపు రాకేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

తూకంలో మోసంపై నిరసన

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రైస్‌మిల్లర్లు తూకంలో మోసానికి పాల్పడుతున్నారంటూ మండలంలోని సింగారంలో రైతులు శనివారం కొనుగోలు కేంద్రంలో నిరసనకు దిగారు. కొద్దిసేపు కొనుగోళ్లు నిలిచిపోయాయి. బస్తాకు 42.500 కేజీలు పెడితేనే దింపుకుంటామని మిల్లర్లు హెచ్చరించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు జోక్యం చేసుకోవడంతో మధ్యాహ్నం తర్వాత కొనుగోళ్లు మొదలయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement