వేగంగా అన్‌లోడింగ్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

వేగంగా అన్‌లోడింగ్‌ చేయాలి

May 9 2026 9:43 AM | Updated on May 9 2026 9:43 AM

● అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌

● అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌

కోనరావుపేట(వేములవాడ): రైస్‌మిల్లుల్లో ధాన్యం అన్‌ లోడింగ్‌ వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌ ఆదేశించారు. కోనరావుపేట, ఎగ్లాస్‌పూర్‌, నాగారం, కనగర్తి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను, కొలనూర్‌లోని మారుతి రైస్‌మిల్లు, కనగర్తిలోని సరస్వతి, కనకదుర్గ రైస్‌మిల్లులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్‌ ఎంట్రీ పూర్తి చేయాలన్నారు. మిల్లులకు తరలించడానికి కాంట్రాక్టర్లతో మాట్లాడి వాహనాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మిల్లుల్లో అన్‌లోడింగ్‌కు జాప్యమవుతుందని, వెంటనే అన్‌లోడింగ్‌ చేయాలని సూచించారు. తహసీల్దార్‌ వరలక్ష్మి, నాయబ్‌ తహసీల్దార్‌ ప్రవీణ్‌ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement