● ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక సభల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి ● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలను ఆవిష్కరిస్తూ సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలస్థాయి సభలను విజయవంతం చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. కలెక్టరేట్‌లో శుక్రవారం అధికారులతో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా శనివారం జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గస్థాయి సభల నిర్వహణపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలు, వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలతో కరపత్రం రూపొందించి పంపిణీ చేయాలని, ఈ సభలకు మంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, యువత, రైతులు, వివిధ పథకాల లబ్ధిదారులను ఆహ్వానించాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు సీహెచ్ వెంకటేశ్వర్లు, రాధాభాయ్, హౌసింగ్ పీడీ వెంకటమాధవరావు, డీఆర్డీవో మచ్చ గీత, సీపీవో పీబీ శ్రీనివాసాచారి, జిల్లా పంచాయతీ అధికారి షరీఫోద్దీన్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా పాల్గొన్నారు.
నూతన ఇసుక రీచ్‌లపై సమీక్ష
సిరిసిల్ల: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఇతర నిర్మాణాలు, స్థానిక అవసరాల కోసం గుర్తించిన నూతన ఇసుక రీచ్‌లపై కలెక్టర్ డిస్ట్రిక్ట్ లెవెల్ సాండ్ కమిటీ సమావేశం నిర్వహించారు.


