సిరిసిల్లటౌన్: నవజాత శిశువు, మాత సంరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంచార క్రిటికల్ కేర్ సేవలు సత్ఫలితాలిస్తున్నాయి. 108 వాహన సేవల మాదిరిగానే ప్రత్యేకంగా నియోనా టల్ వాహనాలు జిల్లాలో విస్తృత సేవలు అందిస్తున్నాయి. సమాచారం అందిన వెంటనే నవజాత శిశువుకు మెరుగైన వైద్యం అందించేలా స్పందిస్తున్న నియోనాటల్ వాహనాల సేవలపై ప్రత్యేక కథనం.
అపర సంజీవనిలా నియోనాటల్
అప్పుడే పుట్టిన శిశువు నుంచి 28 రోజుల వయస్సు గల పసిపాపల పాలిట నియోనాటల్ అపర సంజీవనిలా మారాయి. పుట్టిన శిశువుకు ఆరోగ్య స మస్య ఉంటే మెరుగైన వైద్యం కోసం కరీంనగర్, వ రంగల్ హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు తరలించడం సామాన్యులకు ఇబ్బందిగా మారేది. ఇ లాంటి పరిస్థితుల్లో నియోనాటల్ వాహనాలు భరోసా అందిస్తున్నాయి. ప్రైవేట్ అంబులెన్సులు అధిక వసూళ్లతో తల్లిదండ్రులు ఆర్థిక భారం తప్పేలా సంచార మొబైల్ చికిత్సాలయాలు పనిచేస్తున్నాయి. సుమారు రెండున్నరేళ్లుగా జిల్లాలో నియోనాటల్ కేర్ అంబులెన్సులు సేవలు అందిస్తున్నా యి. నవజాత శిశువులను పీహెచ్‌సీల నుంచి జిల్లా ఆస్పత్రులకు, అవసరమైతే కరీంనగర్, హైదరాబా ద్‌లోని ఆస్పత్రులకు భద్రంగా తరలిస్తున్నారు.
మొబైల్ వైద్యసేవలు ఇలా..
జన్యులోపాలతో బాధపడుతున్న నవజాత శిశువులకు అత్యవసర చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇ లాంటి కేసుల్లో మెరుగైన చికిత్స అవసరమైతే వెంట నే 108కు సమాచారం అందిస్తే, నియోనాటల్ కేర్ అంబులెన్స్ చేరుకుంటుంది. అంబులెన్స్‌లోనే అవసరమైన వైద్యం అందిస్తూ శిశువును వైద్యులు రెఫర్ చేసిన కరీంనగర్, హైదరాబాద్ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈ అత్యాధునిక వాహనాల్లో మినీ ఐసీయూ ద్వారా అత్యవసర వైద్యం అందుతుంది. ఆక్సిజన్ సిస్టమ్, వెంటిలేటర్, పోర్టబుల్ ఆక్సిజన్ సిలిండర్, సిరింజ్ ఇన్ఫ్యూజన్ పంప్, వాల్యూమ్ ఇన్ఫ్యూజన్ పంప్, ఏఈడీ, సెక్షన్ యంత్రం, వార్మర్, లారిగోస్కోప్ వంటి ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి.
జిల్లాలో నియోనాటల్ సేవల ప్రొఫైల్
నెల 2024 2025 2026 జనవరి 77 72 49 ఫిబ్రవరి 78 71 52 మార్చి 79 21 53 ఏప్రిల్ 80 62 54 మే 82 62 –
జూన్ 79 53 –
జూలై 64 58 –
ఆగస్టు 71 56 –
సెప్టెంబర్ 72 49 –
అక్టోబర్ 72 51 –
నవంబర్ 72 60 –
డిసెంబర్ 72 60


