ధాన్యాన్ని వెంటనే అన్‌లోడ్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

ధాన్యాన్ని వెంటనే అన్‌లోడ్‌ చేయాలి

May 17 2026 7:26 AM | Updated on May 17 2026 7:26 AM

ధాన్యాన్ని వెంటనే అన్‌లోడ్‌ చేయాలి ● అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌

● అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌

ఎల్లారెడ్డిపేట/ముస్తాబాద్‌(సిరిసిల్ల): కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని వెంటనే అన్‌లోడ్‌ చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన బస్తాలను వాహనాల ద్వారా మిల్లులకు, గోదాంలకు తరలించాలని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌ సూచించారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్‌లోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ గోదాం, ముస్తాబాద్‌ మండలం గూడెం, ఆవునూర్‌ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు, నామాపూర్‌, బందనకల్‌లో రైస్‌మిల్లులను శనివారం తనిఖీ చేశారు. హమాలీల సంఖ్యను పెంచుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ ట్యాబ్‌ ఎంట్రీ పూర్తి చేయాలన్నారు. తహసీల్దార్‌ ఫారూఖ్‌ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement