అందుబాటులోకి ఏఐ వాట్సాప్ చాట్‌బాట్ బిల్లు విచారణ, అంతరాయం, ఫిర్యాదుల పరిష్కారం సొంత మాటల రూపంలో సందేశాలు ఏఐ వాట్సాప్ నంబర్ : 87124 81489
ముస్తాబాద్(సిరిసిల్ల): విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా క్షణాల్లో ఫిర్యాదు చేసే సదుపాయాన్ని ఎన్పీడీసీఎల్ కల్పిస్తోంది. విద్యుత్ సరఫరాలో అంతరాయం, బిల్లులపై సందేహాలు.. ఏ విషయమైనా కూర్చున్న స్థలం నుంచే అన్ని పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ఎన్పీడీసీఎల్ అధికారులు ప్రత్యేక చాట్‌బాట్ వాట్సాప్‌ను రూపొందించారు. వినియోగదారులకు పారదర్శకంగా, వేగవంతమైన సేవలు అందించే ప్రధాన లక్ష్యంతో టీఎస్‌ఎన్పీడీఎల్ కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత వాట్సాప్ చాట్‌బాట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. వాట్సాప్‌లో తెలుగు, ఇంగ్లిష్‌లో పంపే సందేశాలను అర్థం చేసుకుని.. తగిన పరిష్కారం, సమాచారం అందజేస్తుంది.
బహుముఖ ఏఐ సేవలు
విద్యుత్ సేవలు ఇలా..
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు 80,289
గృహ విద్యుత్ కనెక్షన్లు 1,79,928
పరిశ్రమల కనెక్షన్లు 3,542
దుకాణాలు 15,128
బడులు, గుడులు 18,648
పవర్‌లూమ్స్ 8,265
మెరుగైన సేవలు
వినియోగదారులకు పారదర్శకంగా మెరుగైన సేవలు అందించేందుకు ఏఐ ఆధారిత సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది 24 గంటలు పనిచేస్తుంది. విద్యుత్ అంతరాయం, బిల్లుల చెల్లింపులు, ఇతర ఫిర్యాదులు ఇందులో తెలుసుకోవచ్చు. నాణ్యమైన విద్యుత్ సేవలకు చాట్‌బాటు ఉపయోగపడుతుంది. అధికారులు, సిబ్బంది మరింత బాగా పనిచేసేందుకు తోడ్పడుతుంది.
– విష్ణుతేజ, ఏఈ, ముస్తాబాద్


