
బాలీవుడ్ నటీనటులు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ కొన్నాళ్లుగా ప్రేమలోకంలో విహరిస్తున్న సంగతి తెలిసిందే. వీలు చిక్కినప్పుడల్లా ఈ ప్రేమపక్షులు బయట విహరిస్తూ కెమెరాల కంట పడుతూనే ఉంటాయి. ప్రస్తుతం ఈ జంట రాజస్థాన్‌లో ఉన్నారు. ఇరు కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం ఉదయం (డిసెంబర్ 29) అక్కడకు చేరుకున్నారు. వీరి వెంట కపూర్ కుటుంబం, రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనె కూడా పింక్ సిటీకి పయనమయ్యారు. వీరంతా రాజస్థాన్‌లోని రణతంభోర్ పార్కుకు సమీపంలోని సవాయి మధోపూర్‌లో బస చేస్తున్నారు. అయితే మొత్తం కుటుంబ సభ్యులతో కలిసి అలియా, రణ్‌బీర్ ఒకే చోటుకు వెళ్లడంతో ఈ ప్రేమ జంట జైపూర్‌లో వివాహం ప్టాన్ చేశారని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ రోజే ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకోబుతున్నారని వదంతులు వ్యాపించాయి. ఈ క్రమంలో రణ్‌బీర్ నిశ్చితార్థపు వార్తలపై ఆయన అంకుల్ రణ్‌ధీర్ కపూర్ క్లారిటీ ఇచ్చారు. ఈ జంట ప్రస్తుతం నిశ్చితార్థం చేసుకోవడం లేదని రూమర్లకు ఫుల్‌స్టాప్ పెట్టారు. చదవండి: తనే నా గర్ల్ ఫ్రెండ్, త్వరలోనే పెళ్లి : రణ్‌బీర్
‘రణ్‌బీర్, అలియా నిశ్చితార్థ వార్తలు వాస్తవం కావు. కేవలం పుకార్లు మాత్రమే. ఒకవేళ రణ్‌బీర్ అలియా నిశ్చితార్థం చేసుకుంటే మా కుటుంబ సభ్యులు కూడా వారితో అక్కడికి వెళ్లే వాళ్లం. రణ్‌బీర్, అలియా, నీతు కలిసి న్యూ ఇయర్ హాలీడ్ ట్రిప్‌కు వెళ్లారు. అని స్పష్టం చేశారు. కాగా ఇటీవల ఆలియాతో పెళ్లి విషయమై రణ్‌బీర్ షాకింగ్ విషయం చిప్పిన విషయం తెలిసిందే. తామిద్దరం 2020లోనే పెళ్లి చేసుకోవాలనుకున్నామని తెలిపారు. అయితే కరోనా కారణంగా తమ పెళ్లి వాయిదా పడిందని, లేకపోతే ఈపాటికే జరిగిపోయి ఉండేదని తెలిపాడు. ప్రస్తుతం వీరిద్దరు ‘బ్రహ్మాస్త్ర’ అనే సినిమాలో నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, డింపుల్ కపాడియా, మౌనీ రాయ్, నాగార్జున కీలక పాత్రల్లో కనిపించనున్నారు. చదవండి: ప్రియుడి బంగ్లాలో అలియా కొత్త ఇల్లు