Brahmastra Twitter Review In Telugu - Sakshi
Sakshi News home page

Brahmastra Twitter Review: ‘బ్రహ్మాస్త్ర’ టాక్‌ ఎలా ఉందంటే..?

Sep 9 2022 9:19 AM | Updated on Sep 9 2022 12:34 PM

Brahmastra Movie Twitter Review In Telugu - Sakshi

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన భారీ పాన్ ఇండియా  చిత్రం `బ్రహ్మాస్త్ర`. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌ జంటగా  నటించనగా, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, మౌనీ రాయ్‌ పలు కీలక పాత్రలు పోషించారు.స్టార్‌ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్‌, ప్రైమ్‌ ఫోకస్, స్టార్‌లైట్‌ పిక్చర్స్‌ నిర్మించిన ఈ సినిమా దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి దక్షిణాదిలో సమర్పించారు. భారీ అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్‌ 9) ఈ చిత్రం  హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది.  ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌, పాటలకు భారీ స్పందన లభించింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘బ్రహ్మాస్త్ర’పై హైప్‌ క్రియేట్‌ అయింది. 

ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘బ్రహ్మాస్త్ర’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్‌ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’బాధ్యత వహించదు. 

సినిమాలో క్లైమాక్స్‌, ప్రీ క్లైమాక్స్‌ సీన్స్‌ బాగున్నాయని నెటిజన్స్‌ అంటున్నారు. ఫస్టాఫ్ విషయంలో ఇంకాస్త శ్రద్ద పెడితే బాగుండేదనే కామెంట్స్ కనిపిస్తున్నాయి. రణ్‌బీర్‌, అలియా మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయిందంటున్నారు. అయితే లవ్ స్టోరీకి తగ్గ డైలాగ్స్ లేకపోవడం ఈ సినిమాను మైనస్ అంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement