ఓటీటీలో యానిమల్.. ఆ రెండు సూపర్‌ హిట్ సినిమాలను దాటేసింది! | Sandeep Reddy Vanga Animal Movie Beats RRR Record In OTT Streaming Views, Deets Inside - Sakshi
Sakshi News home page

Animal Movie OTT Viewership Record: రెండో వారంలో అదే జోరు.. ఏకంగా ఆర్ఆర్ఆర్, జవాన్‌ రికార్డ్ బ్రేక్!

Published Wed, Feb 7 2024 4:31 PM

Sandeep Reddy Vanga Animal Beats RRR Record In Ott Streaming Views - Sakshi

సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్‌ చిత్రం యానిమల్. రణ్‌బీర్‌ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. గతడాది డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం రూ.900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాపై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ కలెక్షన్స్‌పై ఎలాంటి ప్రభావం చూపలేదు. అయితే గతనెలలో ఓటీటీకి వచ్చేసిన యానిమల్.. అదే జోరుతో దూసుకెళ్తోంది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. రిలీజైన మొదటి మూడు రోజుల్లోనే టాప్ టైన్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అంతే కాకుండా మొదటి వారంలోనే ప్రభాస్‌ సలార్ మూవీని వెనక్కి నెట్టి రికార్డును బ్రేక్ చేసింది.

తాజాగా మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది యానిమల్. రెండోవారంలో ఏకంగా టాప్‌-1 ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం సలార్ ఐదో స్థానంలో కొనసాగుతోంది. యానిమల్ మూవీకి మొదటి 10 రోజుల్లోనే ఏకంగా ఏకంగా 3.93 కోట్ల గంటల వ్యూయర్‌షిప్ నమోదు చేసింది. ఇప్పటికే ఆల్ టైమ్ అత్యధిక వ్యూయర్‌షిప్ సాధించిన ఇండియన్ సినిమాగా యానిమల్ నిలిచింది. 

ఆర్ఆర్ఆర్ రికార్డు బ్రేక్

ఆర్ఆర్ఆర్ మూవీ గతంలో తొలి 10 రోజుల్లో అత్యధిక వ్యూయర్‌షిప్ సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. ఆ మూవీకి 2.55 కోట్ల గంటల వ్యూయర్‌షిప్ వచ్చింది. గతేడాది షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవీకి కూడా ఇదే స్థాయిలో నమోదైంది. తాజాగా ఈ రికార్డ్‌ను యానిమల్ అధిగమించింది. ఆర్ఆర్ఆర్, జవాన్ సినిమాల కంటే చాలా ఎక్కువ వ్యూయర్‌షిప్‌ను యానిమల్ సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో నెట్‌ఫ్లిక్స్ లో రిలీజైన ఏ సినిమాకూ ఈ స్థాయిలో ఆదరణ లభించలేదు. 

Advertisement
 
Advertisement