
రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి జంటగా మైథలాజికల్ చిత్రం 'రామాయణ'. ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్‌కపూర్ , సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. కేజీఎఫ్ స్టార్ యశ్ రావణుడిగా కనిపించనున్నారు. నితిశ్ తివారీ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా గ్లింప్స్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచి ఇదే తొలి వీడియో కావడం విశేషం. గతంలో రామాయణంపై చాలా సినిమాలొచ్చినా.. ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మరోసారి భారీ బడ్జెట్‌తో రామాయణాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
అయితే రామాయణం అంటే అందరికీ గుర్తుకొచ్చేది శ్రీరాముడు మాత్రమే కాదు.. వాల్మీకి పేరు తప్పకుండా ఉంటుంది. అయితే ఈ సినిమాకు కథ అందించిన రచయిత శ్రీధర్ రాఘవన్‌పై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమాకు కథను తానే రాసినట్లు చెప్పుకోవడంపై నెటిజన్స్ మండిపడుతున్నారు. రామాయణం రచించింది వాల్మీకి అయితే.. ఆ క్రెడిట్ కూడా మీరు ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు. పఠాన్, టైగర్-3 చిత్రాలకు కథ అందించిన శ్రీధర్ రాఘవన్ రామాయణం కూడా రాశాడంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు.
what about brother valmiki? pic.twitter.com/OtR1lfZQtf
— Shreemi Verma (@shreemiverma19) July 3, 2025
Sridhar Raghavan calling himself the writer of Ramayana is not too different from an Indian calling themselves Caucasian or a homeopath calling themselves doctor. pic.twitter.com/L5qIUH0RXL
— রাজ শেখর (@DiscourseDancer) July 4, 2025
The writer of #Ramayana is Shridhar Raghavan, who also wrote Pathaan and Tiger 3 pic.twitter.com/18FS6jmzLu
— Prayag (@theprayagtiwari) July 3, 2025