ఖరీదైన కారు కొనుగోలు చేసిన స్టార్ హీరో.. ఎన్ని కోట్లంటే? | Bollywood Hero Ranbir Kapoor Buys Swanky New Bentley Luxury Car | Sakshi
Sakshi News home page

Ranbir Kapoor: లగ్జరీ కారు కొన్న యానిమల్ హీరో.. ఎన్ని కోట్లో తెలుసా!

Apr 3 2024 6:18 PM | Updated on Apr 3 2024 6:34 PM

Bollywood Hero Ranbir Kapoor Buys Swanky New Bentley Luxury Car - Sakshi

బాలీవుడ్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ గతేడాది యానిమల్‌ చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. అర్జున్‌ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ సినిమాలో రణ్‌బీర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించింది. అంతే కాకుండా మరో బాలీవుడ్ భామ త్రిప్తి డిమ్రీ కీలక పాత్రలో కనిపించింది. 

అయితే తాజాగా రణ్‌బీర్‌ కపూర్‌ ఖరీదైన కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ యానిమల్ హీరో దాదాపు రూ.8 కోట్ల విలువైన కొత్త బెంట్లీ కాంటినెంటల్‌ కారును కొనుగోలు చేశారు. ఈ లగ్జరీ కారులో ముంబైలోని తన నివాసానికి వెళ్తూ కెమెరాలకు చిక్కారు. కాగా.. గతేడాది సైతం బెల్‌గ్రేవియా గ్రీన్ ఎక్స్‌టీరియర్స్‌తో కూడిన అత్యంత ఖరీదైన రేంజ్ రోవర్‌ను  కొనుగోలు చేశాడు. 

ఇదిలా ఉంటే బాలీవుడ్ హీరోయిన్‌ ఆలియా భట్‌ను రణ్‌బీర్‌ కపూర్‌ పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరికీ రాహా కపూర్ అనే కూతురు జన్మించారు. ఇటీవలే తమ కూతురి కోసం దాదాపు రూ.250 కోట్లతో ఇంటిని నిర్మించి ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే అత్యంత పిన్న వయసులోనే కోట్ల ఆస్తులున్న స్టార్‌ కిడ్‌గా రికార్డ్ సృష్టించనుంది. కాగా.. ప్రస్తుతం రణ్‌బీర్‌ కపూర్‌.. నితీష్ తివారీ తెరకెక్కించనున్న రామాయణంలో నటించనున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement