Actress Neetu Kapoor Buys Luxury Flat Worth Rs 17.4 Crores In Mumbai, Deets Inside - Sakshi
Sakshi News home page

Neetu Kapoor: కోట్ల విలువైన ఫ్లాట్ కొనుగోలు చేసిన నీతూ కపూర్!

Published Wed, May 17 2023 1:04 PM

Actress Neetu Kapoor buys property worth Luxury Flat In Mumbai - Sakshi

బాలీవుడ్ సీనియర్ నటి నీతూ కపూర్ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో విశాలమైన ఫోర్ బీహెచ్‌కే అపార్ట్‌మెంట్‌ను దాదాపు రూ.17.4 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మే 10న  రిజిస్టర్ చేసుకున్నారని సమాచారం. కేవలం రిజిస్ట్రేషన్‌కే దాదాపు రూ.1.04 కోట్ల స్టాంప్ డ్యూటీని చెల్లించారు. ప్రస్తుతం పాలి హిల్‌లోని కృష్ణ రాజ్ బంగ్లాలో నివసిస్తున్న నీతు కపూర్ రీసేల్ డీల్‌లో ఈ ఆస్తిని కొనుగోలు చేశారు. 

(ఇది చదవండి: ఫస్ట్‌ డేట్‌లోనే శృంగారానికి ఓకే: స్టార్ హీరోయిన్)

సూరజ్ సినిమాతో అరంగేట్రం చేసిన నీతూ కపూర్ స్టార్‌ హీరోయిన్‌గా పేరు సంపాదించింది. ఆ  తర్వాత దీవార్, ఖేల్ ఖేల్ మే, కభీ కభీ, అమర్ అక్బర్ ఆంథోనీ, ధరమ్ వీర్‌ చిత్రాల్లో నటించారు.  కాలా పత్తర్ చిత్రానికి గానూ ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు దక్కింది. 1980లో ఆమె నటుడు రిషి కపూర్‌ను వివాహం చేసుకోగా.. రణబీర్ కపూర్‌, రిద్దిమా కపూర్ జన్మించారు. 

(ఇది చదవండి: 'బంగారం' సినిమాలో చిన్నారి.. ఇంతలా మారిపోయిందేంటీ?)

Advertisement
 
Advertisement