రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)- యానిమల్ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్‌లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘స్పిరిట్’. ఇటీవలే ఈ బిగ్ ప్రాజెక్ట్ షూటింగ్ అఫీషియల్‌గా లాంఛ్ అయింది. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడెప్పుడు ఎదురు చూసినా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ మూవీ ప్రకటించిన దాదాపు నాలుగేళ్ల తర్వాత షూట్ స్టార్ట్ చేయడం విశేషం. ఈ చిత్రంలో ప్రభాస్ కెరీర్‌లో తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు మరింత పెంచేసింది.
అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ మూవీలో ప్రభాస్ తండ్రిగా మెగా హీరో నటించబోతున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. స్పిరిట్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారని తెగ టాక్ వినిపించింది. తాజాగా ఈ భారీ ప్రాజెక్ట్పై మరో టాక్ నడుస్తోంది.
ఈ చిత్రంలో యానిమల్ హీరో రణ్బీర్ కపూర్ గెస్ట్ రోల్లో నటిస్తున్నారని లేటేస్ట్ టాక్. ఈ టాపిక్ ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కొద్ది రోజుల క్రితమే రణ్బీర్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ప్రభాస్ స్పిరిట్లో ఏ రోల్ చేయడానికైనా సిద్ధమేనని అన్నారు. దీంతో స్పిరిట్లో యానిమల్ హీరో కనిపించడం ఖాయమని సినీ ప్రియులు ఫిక్సయ్యారు. దీనిపై ఇంకా అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.
అయితే రణ్బీర్ కపూర్ స్పిరిట్లో కనిపిస్తే నార్త్లోనూ బిగ్ హైప్ తీసుకొచ్చేలా సందీప్ రెడ్డి ప్లాన్ చేశారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ ఉన్నప్పటికీ.. యానిమల్ హీరో ఎంట్రీతో వేరే లెవెల్లో ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారు. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. కాగా.. ఈ చిత్రంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా కనిపించనుంది.


