ఆ హీరోను మరోసారి పొగిడిన అమితాబ్‌ | Amitabh Bachchan shares Some Pics With Ranbir Kapoor From Brahmastra Sets | Sakshi
Sakshi News home page

రణ్‌బీర్‌ను మరోసారి ప్రశంసించిన బిగ్‌బీ

Feb 26 2020 12:37 PM | Updated on Feb 26 2020 12:53 PM

Amitabh Bachchan shares Some Pics With Ranbir Kapoor From Brahmastra Sets - Sakshi

ముంబై : బాలీవుడ్‌ మెగా స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ 50 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్నారు. ఏడు పదుల మయసులోనూ నిర్విరామంగా సినిమాలు చేస్తూ యంగ్‌ హీరోలతో పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఆయన ‘బ్రహ్మస్త్ర’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌, అమితాబ్‌, మౌని రాయ్‌, డింపుల్‌ కపాడియా, అక్కినేని నాగార్జున ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారు. అయితే రణ్‌బీర్‌, అమితాబ్‌ కలిసి నటిస్తున్న మొదటి చిత్రం ఇదే. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ సందర్భంగా రణ్‌బీర్‌తో కలిసి ఉన్న ఫోటోలను  అమితాబ్‌ మంగళవారం సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. (డిసెంబర్‌ 4న ‘బ్రహ్మస్త్ర’)

‘‘నేను ఇష్టపడే వారిలో  ఒకరైనా రణ్‌బీర్‌తో కలిసి పని చేస్తున్నాను. అతని టాలెంట్‌తో సమానం కావడానికి నాకు నాలుగు కుర్చీలు అవసరమయ్యాయి’’. అనే క్యాప్షన్‌తో ట్వీట్‌ చేశారు. అయితే బిగ్‌బీ రణ్‌బీర్‌ను ప్రశంసించడం ఇదేం మొదటిసారి కాదు. ఇంతకముందు కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘రణ్‌బీర్‌ చాలా సునాయసంగా హావాభావాలను వ్యక్తపరచగలడు. అది అతనికి దేవుడిచ్చిన వరం. కానీ  నేనైతే  భావోద్వేగాలను వ్యక్తపరచడానికి ఎల్లప్పుడూ కష్టపడుతుంటాను. అలాగే ఈ విషయంలో డైరెక్టర్‌ సలహాను తీసుకుంటాను’. అంటూ పొగడ్తలతో ముంచేశాడు. ఇక బిగ్‌బీ ట్వీట్‌పై రణ్‌బీర్‌ స్పందించారు. ఇంతకంటే గొప్ప ప్రశంసను నేను ఎప్పటికీ పొందలేనని,. అమితాబ్‌ నాకు కుటుంబంలోని వ్యక్తి వంటి వారని.. ఎందుకంటే నన్ను కూడా ఆయన తన కుటుంబంలోని వ్యక్తిలా ట్రీట్‌ చేస్తారని తెలిపారు. కాగా కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్న ఈ మూవీ డిసెంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.(అమితాబ్‌పై అమర్‌సింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు)

చదవండి: ప్రధాని మోదీ తరువాత బిగ్‌బీనే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement