‘ఇప్పటిదాకా అన్నీ తన ఇష్టప్రకారమే జరిగాయి’ | Soni Razdan Comments on Alia Bhatt Relationship With Ranbir Kapoor | Sakshi
Sakshi News home page

రణ్‌బీర్‌ స్వీట్‌ పర్సన్‌ : సోనీ రాజ్‌దాన్‌

Mar 29 2019 2:30 PM | Updated on Mar 29 2019 2:35 PM

Soni Razdan Comments on Alia Bhatt Relationship With Ranbir Kapoor - Sakshi

రణ్‌బీర్‌ కపూర్‌, సోనీ రాజ్‌దాన్‌, నీతూ కపూర్‌, అలియా భట్‌

రణ్‌బీర్‌ చాలా మంచి వ్యక్తి.. తన చుట్టూ ఉన్న వాళ్లను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు.

అందరు తల్లుల్లాగే తాను కూడా కూతురు సంతోషాన్నే కోరుకుంటానంటున్నారు బాలీవుడ్‌ నటి సోనియా రాజ్‌దాన్‌. తన కూతురు అలియా భట్‌- రణ్‌బీర్‌ కపూర్‌ గురించి ప్రచారమవుతున్న రూమర్లపై ఆమె స్పందించారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘ ఇది అలియా వ్యక్తిగత విషయం. ఇప్పటివరకు తను ఎవరితో డేటింగ్‌ చేసినా అది ఆమె ఇష్టప్రకారమే జరిగింది. ప్రస్తుతం తను ఎవరిని ప్రేమిస్తుందో నాకు తెలియదు. ఒక తల్లిగా తనను జాగ్రత్తగా చూసుకుంటూ, సంతోషంగా ఉంచడమే నా విధి. తన వ్యక్తిగత విషయం గురించి పబ్లిక్‌లో మాట్లాడటం సరికాదు’ అని పేర్కొన్నారు.

ఇక రణ్‌బీర్‌ కపూర్‌ గురించి ప్రస్తావించగా.. ‘రణ్‌బీర్‌ చాలా మంచి వ్యక్తి.. తన చుట్టూ ఉన్న వాళ్లను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు’ అంటూ సోనీ ప్రశంసలు కురిపించారు. కాగా చాక్‌లెట్‌ బాయ్‌ రణ్‌బీర్‌ కపూర్‌తో అలియా రిలేషన్‌లో ఉన్నారంటూ బీ-టౌన్‌లో వార్తలు విన్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి అలియా ఎప్పుడూ బయటపడలేదు గానీ.. రణ్‌బీర్‌- అలియా కుటుంబ సభ్యులు చనువుగా ఉండటం, తరచుగా డిన్నర్లకు వెళ్లడం చూస్తుంటే త్వరలోనే వీరి పెళ్లి బాజాలు మోగనున్నాయని గాసిప్‌ రాయుళ్లు కథనాలు అల్లేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరు ‘బ్రహ్మాస్త్ర’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement