బాయ్‌ఫ్రెండ్‌ ఫోటో షేర్‌ చేసింది ఆపై..

Deepika Padukone Slammed For Sharing Ranbir Kapoor Photo - Sakshi

‘మరి కొద్ది రోజుల్లో ఇంకొకరిని వివాహం చేసుకోబోతూ ఇదేం పని’ అంటూ బాలీవుడ్‌ ‘పద్మావత్‌’ దీపికా పదుకోన్‌ను విమర్శిస్తున్నారు నెటిజన్లు. అభిమానులకు అంత ఆగ్రహం తెప్పించే పని దీపిక ఏం చేసిందా అని ఆలోచిస్తున్నారా.. ఆదివారం (నిన్న) ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన ఫోటోను పోస్టు చేశారు దీపికా. గతంలో ‘తమషా’(2015) షూటింగ్‌ సందర్భంగా క్రొయేషియాలో రణ్‌బీర్‌ కపూర్‌తో దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు దీపికా. కానీ ఇది ఆమె అభిమానులకు నచ్చలేదు.

Capturing Moments 📸📸 #WorldPhotographyDay

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

దాంతో ‘నువ్వు నీ గతాన్ని షేర్‌ చేస్తే నీ జీవితం కూడా తమాషా అవుతది’, ‘నువ్వు దీపిక కాదు చీపికా’, ‘నువ్వు త్వరగా ఒక మానసికి నిపుణుడిని కలిస్తే మంచిది’, ‘నీ హృదయం ఇంకా నీ మాజీ బాయ్‌ఫ్రెండ్‌ కోసమే తపిస్తోంది.. కానీ ఇప్పుడు నువ్వు నీకు ఏ మాత్రం ఇష్టం లేని ఒక వ్యక్తిని వివాహం చేసుకోబోతున్నావు.. ఎందుకంటే సింగిల్‌గా ఉండి నీకు బోర్‌ కొట్టింది కాబట్టి’ అంటూ దీపికను తెగ ట్రోల్‌ చేస్తున్నారు.

దీపికా, రణ్‌బీర్‌ కపూర్‌లు విడిపోయి దాదాపు ఒక దశాబ్దం అవుతోంది. అయినప్పటికి వీరిద్దరూ మంచి స్నేహితులాగానే ఉంటున్నారు. బ్రేకప్‌ చెప్పుకున్న తర్వాత కూడా వీరిద్దరూ కలిసి ‘యే జవానీ హై దివానీ’(2010), ‘తమాషా’(2015) వంటి చిత్రాల్లో కలిసి నటించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top