సందీప్ రెడ్డి యాక్షన్‌ థ్రిల్లర్‌.. ట్రైలర్ చూశారా? | Sandeep Reddy Vanga And Ranbeer Kapoor Movie Animal Trailer Released, Watch Inside Video Goes Viral - Sakshi
Sakshi News home page

Animal Trailer: 'మనం కన్నది ఒక క్రిమినల్‌ని'.. ఆసక్తిగా ట్రైలర్!

Published Thu, Nov 23 2023 2:41 PM

Sandeep Reddy Vanga And Ranbeer Kapoor Movie Animal Trailer Release - Sakshi

అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా డైరెక్షన్‌లో తెరకెక్కించిన చిత్రం యానిమల్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించారు.  బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ టీ సిరీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫుల్ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్‌ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ట్రైలర్‌ రిలీజ్ చేశారు మేకర్స్. 

ట్రైలర్ చూస్తే తండ్రీ, కొడుకుల మధ్య ఎమోషనల్‌గా కథగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అయితే ఫుల్ యాక్షన్‌ సీన్స్ ఉండడంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్‌తో ఈ మూవీపై భారీ అంచనాలు పెంచేశాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్‌ కూడా పూర్తయింది. ఈ మూవీకి  ఏ సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు.  ఈ మూవీ రన్‌టైమ్‌ చూస్తే భారీ నిడివితోనే వస్తోంది. ఏకంగా మూడు గంటల 21 నిమిషాల పాటు ఉందని డైరెక్టర్ సందీప్ రెడ్డి వెల్లడించారు. 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement