Alia Bhatt Shares Photo Of A Baby Girl - Sakshi
Sakshi News home page

Alia Bhatt: బేబీ ఫోటోలు షేర్ చేసిన ఆలియా భట్.. ఆమె కూతురేనా?

Feb 17 2023 9:55 AM | Updated on Feb 17 2023 10:21 AM

Alia Bhatt Shares Baby Pics Of Their Lovey Girl Baby - Sakshi

ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్‌ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది వివాహాబంధంతో ఒక్కటైన ఈ జంటకు నవంబర్‌లో పండంటి బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. తమ ముద్దురు కూతురుకు రాహా అని నామకరణం కూడా చేశారు. అయితే ఇప్పటి వరకు బేబీ ఎక్కడా కూడా కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. అయితే తాజాగా ఆలియా భట్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరలవుతున్నాయి. ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్ ఆమె కూతురే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

అయితే రెండేళ్ల వరకు తమ బేబీని చూపించబోమని ఇప్పటికే ఆమె సన్నిహితులు కూడా తెలిపారు. అందుకే సోషల్ మీడియాలోను ఇప్పటివరకు ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. దీంతో తాజాగా ఆమె షేర్ చేసిన బేబీ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. పింక్ డ్రెస్‌లో ఉన్న బేబీ ఫోటో అచ్చం ఆలియా భట్‌ లాగే ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆ పాప ఆలియా-రణ్‌బీర్ గారాలపట్టి రాహా అని పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ ఫోటోలు కేవలం ప్రమోషన్స్‌లో భాగంగానే చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అలియా భట్ దంపతులు స్పందిస్తేనే మరింత క్లారిటీ రానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement