యానిమల్ అసలు రన్‌టైమ్‌ అది కాదు.. వామ్మో అంతకుమించి! | Sakshi
Sakshi News home page

Animal Movie: యానిమల్ రన్‌టైమ్‌ అసలు రన్‌టైమ్‌ ఎంతో తెలుసా?

Published Tue, Nov 28 2023 12:31 PM

Ranbeer Kapoor and Rashmika Latest Movie Animal Runtime Goes Viral - Sakshi

ప్రస్తుతం సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం యానిమల్. రణ్‌బీర్‌ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటిస్తోన్న ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌ ఈ సినిమాపై అంచనాలు అమాంతెం పెంచేసింది. తాజాగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్న చిత్రబృందం చెన్నైలోనూ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ మీట్‌కు రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక, సందీప్ రెడ్డి వంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యానిమల్ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా మూవీ రన్‌టైమ్‌ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 

(ఇది చదవండి: బిగ్‌బాస్‌ వార్నింగ్.. డబ్బులిచ్చి మరీ ఎలిమినేట్‌ అవుతానంటున్న కంటెస్టెంట్‌!)

ప్రస్తుతం ఆడియన్స్ రెండున్నర గంటల సినిమా చూసేందుకే బోరింగ్‌గా ఫీలవుతున్నారు. అలాంటిది సందీప్ రెడ్డి ఏకంగా మూడు గంటల 21 నిమిషాల రన్‌టైమ్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. అయితే దీనిమీదే ప్రస్తుతం ఆడియన్స్‌లో తెగ చర్చ నడుస్తోంది. అయితే చెన్నైలో జరిగిన ఈవెంట్‌లో దీనిపై మేకర్స్ చేసిన కామెంట్స్ మరింత వైరలవుతున్నాయి. కాగా.. ఇప్పటికే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

అయితే సందీప్ రెడ్డి వంగా చిత్రానికి అసలు రన్‌ టైమ్‌ సుమారు 3 గంటల 49 నిమిషాలుగా ఉందట. ఇంత లాంగ్ రన్‌టైమ్‌ మూవీని చూడాలంటే ఆడియన్స్‌కు కష్టమే. అందులోనూ రోజు నాలుగు షోలు వేయాలంటే కూడా వీలు కాదు. అందువల్లే 3 గంటలా 21 నిమిషాలకు తగ్గించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రణ్‌బీర్‌ కపూర్‌ ప్రమోషన్స్‌లో వెల్లడించారు. మరోవైపు ఈ సినిమాలో ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ ఏకంగా 18 నిమిషాల పాటు సాగుతుందని సమాచారం. దీనిపై స్పష్టత రావాలంటే సినిమా వచ్చే దాకా వేచి చూడాల్సిందే. అయితే ఓటీటీలోనైనా ఫుల్ మూవీని రిలీజ్ చేస్తారేమో చూడాలి. 

(ఇది చదవండి: రణ్‌బీర్‌.. ఇక్కడికి షిఫ్ట్‌ అయిపో.. తెలుగువాళ్లు బాలీవుడ్‌ను..)

Advertisement
 
Advertisement
 
Advertisement