బిగ్‌బాస్‌ వార్నింగ్.. డబ్బులిచ్చి మరీ ఎలిమినేట్‌ అవుతానంటున్న కంటెస్టెంట్‌! | Sakshi
Sakshi News home page

Bigg Boss: రూ.2 కోట్ల జరిమానా చెల్లిస్తా.. హౌస్‌ నుంచి తప్పుకుంటా..!

Published Tue, Nov 28 2023 11:17 AM

Anurag Dobhal Wants To Voluntarily QUIT After Getting Bigg Boss Warning - Sakshi

బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న రియాలిటీ షో బిగ్‌బాస్‌. బాలీవుడ్‌లో హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ ఈ షోను తెగ చూసేస్తున్నారు. ప్రస్తుతం హిందీలో సీజన్-17 నడుస్తోంది. ఈ సీజన్‌కు హోస్ట్‌గా సల్మాన్ ఖాన్ వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొన్న అనురాగ్ ధోబాల్.. హోస్ట్‌గా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సల్మాన్‌ ఖాన్‌ను ఉద్దేశించి హాట్ కామెంట్స్  చేశారు. ఈ విషయాన్ని హోస్‌లో ఉన్న మరో కంటెస్టెంట్‌ సనా రయీస్ ఖాన్‌తో చెప్పారు. 

హోస్ట్‌గా ఉండాల్సిన మీరే పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని సల్మాన్‌ను ఉద్దేశించి అనురాగ్ ధోబాల్ ఆరోపించారు. అయితే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న బిగ్‌బాస్‌.. కంటెస్టెంట్‌ అనురాగ్‌కు వార్నింగ్ ఇచ్చాడు. మరోసారి ఇలా జరగకుండా చూసుకోవాలని సూచించాడు. అయితే బిగ్ బాస్‌ కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకున్న అనురాగ్‌ ఈ షో నుంచి మధ్యలోనే తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు.  


 
బిగ్‌బాస్ వార్నింగ్ ఇవ్వడాన్ని తనకు అగౌరవంగా భావిస్తున్నట్లు హౌస్‌మేట్స్‌తో చెప్పడం కనిపించింది.  బిగ్ బాస్ తనను తిట్టిన తరువాత స్వచ్ఛందంగా షో నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్లు హోస్‌మేట్స్‌తో చెప్పారు. ఇకపై ఈ షో గురించి పట్టించుకోనని అనురాగ్ అన్నారు. ఈ షో కంటే నాకు అభిమానులు, కుటుంబం చాలా ముఖ్యమని తెలిపారు. బిగ్ బాస్ షో నుంచి స్వచ్ఛందంగా తప్పుకునేందుకు రూ.2 కోట్లు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నానని హోస్‌మేట్స్‌తో అనురాగ్ ధోబాల్ అన్నారు. 

Advertisement
 
Advertisement