ఏడాదిన్నర ఆగితే.. 12 రోజులు షూట్‌ చేశారు: బాబీ డియోల్‌ | Bobby Deol Interesting Comments On Animal Movie | Sakshi
Sakshi News home page

ఏడాదిన్నర ఆగితే.. 12 రోజులు షూట్‌ చేశారు: బాబీ డియోల్‌

Sep 10 2024 7:44 AM | Updated on Sep 10 2024 8:44 AM

Bobby Deol Interesting Comments On Animal Movie

సందీప్‌రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్‌’ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రంలో బాబీ డియోల్‌ విలన్‌గా నటించాడు. సినిమా రిలీజ్‌ తర్వాత చాలామంది రణ్‌బీర్‌తో పాటు బాబీ డియోల్‌ నటనపై కూడా ప్రశంసలు కురిపించారు. తెరపై ఆయన కనిపించేది కాసేపయినా.. తనదైన నటనతో భయపెట్టాడు. అయితే పాత్ర కోసం బాబీ దాదాపు ఏడాదిన్నర వేచి చూశాడట. ఒకనొక దశలో సినిమాలో తన పాత్ర ఉంటుందో లేదో అని భయపడిపోయాడట. ఈ విషయాన్ని స్వయంగా బాబీ డియోలే తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. 

bobby doel

‘ఒక రోజు నాకు సందీప్‌ వంగా నుంచి వాట్సాప్‌ మెసేజ్‌ వచ్చింది. తాను తీయబోతున్న కొత్త సినిమాలో విలన్‌ పాత్ర కోసం కలవాలని చెప్పారు. వెంటనే ఫోన్‌ చేసి మాట్లాడాను. కథ చెప్పేందకు నా దగ్గరకు వస్తూ.. ఓ ఫోటోని తీసుకొని వచ్చాడు. అది నేను  సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌లో పాల్గొన్న ఫోటో. అందులో నా ఎక్స్‌ప్రెషన్స్‌ చూసి ఆ పాత్రకు సెలెక్ట్‌ చేసుకున్నానని సందీప్‌ చెప్పడంతో ఆశ్చర్యపోయాను. కథ, నా పాత్ర నచ్చి వెంటనే ఒకే చెప్పేశాను. షూటింగ్‌ మొదలై నెలలు గడుస్తున్న నన్ను మాత్రం పిలవలేదు. దీంతో నాకు అనుమానం కలిగింది. సందీప్‌ మనసు మార్చుకొని నా పాత్రను వేరే వాళ్లకి ఇచ్చాడేమో అనుకున్నాను. 

దాదాపు ఏడాదిన్నర తర్వాత నాకు పిలుపొచ్చింది.రణ్‌బీర్‌తో కలిసి నేను 12 రోజులు మాత్రమే షూటింగ్‌లో పాల్గొన్నాను. అయితే సినిమా ఈ స్థాయిలో విజయం సాధిస్తుందని ఊహించలేదు. నేను తెరపై కనిపించేది కాసేపే అయినా.. ప్రతి ఒక్కరు నా పాత్ర గురించి మాట్లాడుకోవడం సంతోషంగా అనిపించింది.  సినిమా విడుదలకు ముందు తన అత్తయ్య చనిపోవడం వల్లే సెలబ్రేషన్స్‌లో పాల్గొనలేకపోయాను’అని బాబీ డియోల్‌ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం  బాబీ.. సూర్య హీరోగా నటిస్తున్న ‘కంగువా’ చిత్రంలో విలన్‌ పాత్రను పోషిస్తున్నాడు. అలాగే పవన్‌ కల్యాణ్‌ ‘హరిహర వీరమల్లు’, యశ్‌ రాజ్‌ ఫిల్మ్‌ నిర్మిస్తున్న ‘ఆల్ఫా’, బాలకృష్ణ 109వ చిత్రంలోనూ కీలక పాత్రలు పోషిస్తున్నాడు. 

Advertisement
 
Advertisement
Advertisement