టాలీవుడ్‌కి యువత రావాలి | Sakshi
Sakshi News home page

టాలీవుడ్‌కి యువత రావాలి

Published Thu, Dec 1 2022 3:56 AM

Talasni Srinivas Yadav Speech At Cheppalani Undhi Audio Launch - Sakshi

‘‘తెలుగు చిత్ర పరిశ్రమకు యువత రావాల్సిన అవసరం ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌తో పని లేకుండా ప్రతిభతో చరిత్ర సృష్టించే అవకాశం సినిమా పరిశ్రమలోనే ఉంటుంది’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. యష్‌ పూరి, స్టెఫీ పటేల్‌ జంటగా అరుణ్‌ భారతి ఎల్‌.దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చెప్పాలని ఉంది’. ఆర్‌బీ చౌదరి సమర్పణలో వాకాడ అంజన్‌ కుమార్, యోగేష్‌ కుమార్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలవుతోంది.

అస్లాం కీ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో విడుదలకు తలసాని శ్రీనివాస్, హీరో నిఖిల్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ‘‘యష్‌ పూరి నాన్నగారు నా చిన్నప్పటి స్నేహితుడు. యువత చూడాల్సిన చిత్రం ‘చెప్పాలని ఉంది’’ అన్నారు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. ‘‘మన యూత్‌ సినిమా ఇది.. థియేటర్లో చూద్దాం’’ అన్నారు నిఖిల్‌. ‘‘అన్ని భాషల నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేసిన ఈ చిత్రం ఒక విధంగా పాన్‌ ఇండియా ఫిలిం’’ అన్నారు అరుణ్‌ భారతి. యష్‌ పూరి, స్టెఫీ పటేల్, సంగీత దర్శకుడు అస్లాం కీ, నిర్మాత సి.కల్యాణ్‌ మాట్లాడారు.

Advertisement
 
Advertisement
 
Advertisement