Salaar Movie: ఒకే సినిమాలో ప్రభాస్‌, యశ్‌?... ‘నెక్ట్స్ లెవల్‌ అంతే..’

Is Prashanth Neel Plan to Plays Guest Role With Yash In Prabhas Salaar Movie - Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్  హీరోగా కేజీయఫ్‌ ఫేం ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న చిత్రం ‘సలార్’. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా మూవీగా సలార్‌ను తెరకెక్కుతోంది. 'కేజీయఫ్‌' .. 'కేజీయఫ్‌ 2' సినిమాలతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ ఈ మూవీకి దర్శకుడు కావడంతో సలార్‌పై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ దశలో ఉంది. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన ఇటూ ప్రభాస్‌ ఫ్యాన్స్‌, అటూ యశ్‌ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

చదవండి: దయచేసి నాకు, నరేశ్‌కు సపోర్డు ఇవ్వండి..

ఈ సినిమాలో యశ్‌తో ఓ గెస్ట్‌ చేయించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. కేజీయఫ్‌ చిత్రంతో సౌత్‌లోనే దేశవ్యాప్తంగా యశ్‌ ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో సలార్‌ యశ్‌తో అతిథి పాత్ర చేయించేందుకు ప్రశాంత్‌ నీల్‌ ప్లాన్‌ చేశాడట. ఇక ఇది తెలిసి ఇటూ డార్లింగ్‌ ఫ్యాన్స్‌, అటూ రాక్‌స్టార్‌ ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకుంటున్నారు. ‘ఇద్దరు పాన్‌ ఇండియా స్టార్లలను ఒకే ఫ్రేమ్‌లో చూస్తే ఆ సీన్‌ నెక్ట్‌ లెవల్‌’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే ఈ వార్తలపై స్పష్టత రావాలంటే చిత్ర బృందం స్పందించే వరకు వేచి చూడాల్సిందే.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top